Kannada Heroes: వామ్మో ఈ కన్నడ బ్యాచ్ అంతా ముదుర్లే .. ఒక్క మాట నోరు జారరు

నిజమే.కన్నడ బ్యాచ్ అంత ఒకేలా ప్రవర్తిస్తున్నారు.మాట జారరు.నోరు అదుపు తప్పదు.విజయ గర్వం అసలు తలకు ఎక్కలేదు.ఒక వైపు కెజిఎఫ్ సినిమాలు, కాంతారా, చార్ల్య్ 777 , గరుడగమన వృషభ వాహన సినిమాలతో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ బాలీవుడ్ ని బ్రష్టు పట్టించారు.

 Kannada Celebs Reaction On Pan India Movies Yash Rishab Shetty Prasanth Neel Det-TeluguStop.com

ఈ మాట మాత్రం కన్నడ లో ప్రస్తుతానికి స్టార్స్ అయినా రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, యష్, ప్రశాంత్ నీల్ లాంటి వారి దగ్గర అంటే అసలు ఒప్పుకోరు.అసలు సినిమా అంటే ఇండియన్ సినిమా మాత్రమే.

అందులో ఆ వూడ్ ఈ వూడ్ అంటూ ప్రాంతాన్ని, భాషను వేరు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తారు.పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడు కానీ లేదంటే అతడు వీరి బ్యాచే.

ఇక ఈ మధ్య ఒక కాన్వర్సేషన్ లో హీరో యాష్ ని ఎంత టెంప్ట్ చేసిన ఒక్క మాట కూడా తులలేదు.ఎవరి భాషను తక్కువ చేయలేదు.

అసలు కాంతారా నీ సినిమా కాదు అంటే కూడా ఒప్పుకోలేదు.నా చిత్రమే అంటూ ప్రశ్నిస్తున్న రాజదీప్ సర్దేశాయ్ ని మాట్లాడనివ్వలేదు.

అడగడానికి ప్రశ్నలు లేక సర్దుకొని వెళ్ళిపోయాడు.ఇదే అవకాశం బాలీవుడ్ కి వచ్చినప్పుడు మనల్ని ఎంత చీప్ గా చూసిందో అందరం చూసాం.

కేవలం బాలీవుడ్ కి మాత్రమే సినిమా తీసే దమ్మున్నట్టు మాట్లాడుతూ మిగతా బాషల సినిమాలను అవహేళన చేసారు.ఓసారి ఆ మాటలు తట్టుకోలేక అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ కూడా చేసాడు.

Telugu Allu Arjun, Rajamouli, Yash, Kannada Heroes, Kannada, Kantara, Kgf, Pan I

ఇక రిషబ్ కూడా అంతే మా బాషా, మా సంస్కృతి, వాటి గొప్ప తనం మాత్రమే చెప్తామని మాకు పాన్ ఇండియా పైన నమ్మకం లేదు అంటూ కుండా బద్దలు కొట్టాడు.ఇక రక్షిత్ శెట్టి సైతం ఇప్పటికి మన తెలుగు లో మార్కెట్ లేకపోయినా సేమ్ ఇలాగె ఉంటాడు.డౌన్ టూ ఎర్త్ అన్నట్టుగా వచ్చిన అవకాశాలని చేసుకుంటూ వెళ్లిపోవడమే.ఇక ప్రశాంత్ నీల్ అయితే రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా హిట్ అయినా ఏ మాత్రం నోరు జారలేదు.

రాజమౌళి సైతం కెజిఎఫ్ కి తెలుగు లో బాటలు వేయడం తోనే ఈ రోజు ఇంతలా మార్కెట్ పెరిగింది.ఇలా ఒక సెక్షన్ జనాలు ఏంటో కమిటెడ్ గా ఉంటూ సినిమాలు మాత్రమే తీస్తూ పోతారు అనవసరమైన వేషాలు వేయరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube