ఇప్పటంలో పవణ్ కళ్యాణ్ ఒకరౌడిలా వ్యవహరించారని కారుమీద కూర్చుని రౌడిలా వెళ్లాడని మంత్రి రోజా శ్రీశైలంలో మండిపడ్డారు.శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం అనంతరం శ్రీశైలం మండలంలోని సుండిపెంట గ్రామం కొత్తబజారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి రోజా పాల్గొన్నారు రోజాతోపాటు ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి హాజరయ్యారు.
మీటింగ్ స్టేజిపై మంత్రి రోజా పవన్ చంద్రబాబులపై మండిపడ్డారు.అసలు మంగళగిరి దగ్గర ఉండే ఇప్పటానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లాడో అర్ధంకాని పరస్దితని.
ఇప్పటంలొ ఓడిపోయిన అభ్యర్థి లోకేష్ అయితే అక్కడికి లోకేష్ వెళ్లాలి కాని పవణ్ కళ్యాణ్ వెళ్లటమేంటని ఎద్దేవా చేశారు.పవణ్ కళ్యాణ్ వైజాక్ కాని ఇప్పటానికి కాని వెలితె చాలా సంతోషం ఉపయోగమని షటెర్లు విసిరారు.
భవిష్యత్తులో ఇంకా ఇరువై ముప్పై ఏండ్ల వరకు జగన్ మోహన్ రెడ్డి తగ్గెదేలే చంద్రబాబు పవణ్ కళ్యాణ్ నెగ్గెదేలే అంటూ పుష్పా సినిమాలోని డైలాగులను మంత్రి రోజా కొట్టారు అనంతరం మహాత్మాగాంధీ పొట్టిశ్రీరాములు విగ్రహాల ఓపనింగ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు.