ముంబై ముద్దు గుమ్మ శ్రద్దా దాస్ నటన అంటే చిన్నతనం నుంచే ఎంతో ఇష్టం.అందుకే అటువైపుగానే తన చదువులు కూడా ఎంచుకుంది.
డిగ్రీ అవ్వగానే థియటర్స్ చేసిన శ్రద్ద కొన్ని వర్క్ షాప్స్ కూడా హాజరయ్యి సినిమా నాలెడ్జి పెంచుకుంది.తొలుత హిందీ లో నటించాలని కలలు కన్నప్పటికీ తెలుగు లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో మెరిసింది.
వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రద్ద ఆ ఏడాది వరస పెట్టి సినిమాల్లో నటించింది.హీరోయిన్ గా మాత్రమే ఉండాలని అనుకోకుండా వచ్చిన ప్రతి పాత్రలో కనిపించింది.
అధినేత, ఆర్య 2, 18 , 20 లవ్ స్టోరీ, డైరీ వంటి సినిమాల్లో ఇక కాలంలో నటించింది.
లాహోర్ వంటి సినిమాతో హిందీ లో సైతం నటించిన శ్రద్ద తెలుగు, కన్నడ మరియు బెంగాలీ సినిమాల్లో నటించింది.
కానీ స్టార్ హీరోయిన్ అవ్వకుండానే కెరీర్ ని కోల్పోతూ వస్తున్న శ్రద్ద సినిమాల్లో కాకూండా నిజ జీవితంలో కొన్ని వివాదాలను ఎదుర్కొంది.ఇక వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడటం వల్ల ఆమె ఎక్కువగా సినిమాల్లో నటించలేదు అని కూడా అంటూ ఉంటారు.
వరుణ్ సందేశ్ హీరో గా నటించిన మరో చరిత్ర సినిమాలో శ్రద్ద దాస్ ఒక పాత్రలో నటించింది.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది.
ఇద్దరు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకున్నారు.
ఇక వరుణ్ మరియు శ్రద్ద దాస్ ప్రేమకు వరుణ్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.కానీ కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నాక ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.అయితే ఈ విషయం పై పలు మార్లు శ్రద్ద దాస్ కి మీడియా తో ప్రశ్నలు ఎదురు అవ్వగా ఆమె ఓపెన్ అయ్యింది.
తమ ప్రేమ నిజమే కానీ మా బ్రేకప్ మా ఇష్ట పూర్వకంగానే జరిగిందని చెప్పుకోచ్చింది.వరుణ్ పేరెంట్స్ వల్లనే విడిపోయారా అని కొంత మంది అనుకుంటున్నారని కానీ అది నిజం కాదని వారు చాల మంచి వారని శ్రద్ద తెలపడం విశేషం, ఇక వరుణ్ వితిక షేరు తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోగా, శ్రద్ద మతం స్టిల్ సింగిల్ గానే ఉంది.