కుక్క, పిల్లి మధ్య వైరం ఉంటుందనే నిజం అందరికీ తెలిసిందే.కాకపోతే ఒకే యజమాని వీటిని రెండిటినీ పెంచుకుంటే అవి రెండు కూడా ఒకటికి ఒకటి సర్దుకుపోతుంటాయి.
రెండు కూడా స్నేహం చేసుకుంటూ తమ వైరుధ్యాన్ని మరిచిపోతుంటాయి.అయినా కూడా ఇవి సరదాగా పోట్లాడుకుంటుంటాయి.
పిల్లి తన చేతులతో పంచులు విసిరితే కుక్క పిల్లిని ఉరికిస్తూ ఆడుకుంటుంది.అయితే తాజాగా ఒక పిల్లి కుక్కని గుండ్రంగా తిప్పి పడేసింది. డబ్ల్యూడబ్ల్యూఈలో ఫేమస్ రిజ్లర్ అయిన జాన్ సీనా వలె ఇది కుక్కని భలే కింద పడేసింది.@Yoda4ever అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది.ఈ వీడియోకి ఇప్పటికి 26 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
హచ్ ప్రకటనలో వాడిన పగ్ బ్రీడ్ డాగ్‌ని మీరు చూసే ఉంటారు.
పెద్దగా పెరిగిన అలాంటి డాగ్ పరిమాణంలో ఒక పిట్‌బుల్ పిల్ల పిల్లి కంటే కాస్త తక్కువ ఎత్తే ఉంటుంది.అలాంటి పిట్ బుల్ డాగ్‌ని ఒక పిల్లి ఎత్తివేయడాన్ని వైరల్ వీడియోలో మీరు గమనించవచ్చు.
అచ్చం జాన్ సీనా ప్రత్యర్థి మెడపట్టుకొని ఎలా పైకి లేపి కింద ఎత్తేస్తాడో అలానే ఈ పిల్లి కుక్క మెడ పట్టుకొని ఆ సిగ్నేచర్ మూవ్ రిపీట్ చేసింది.దీన్ని యజమాని తన ఫోన్ లో రికార్డ్ చేశారు.
ఆ వీడియోని @Yoda4ever షేర్ చేయగా నెటిజన్లు అవాక్కవుతున్నారు.“ఈ పిల్లి మామూలుది కాదు, ఇది గత జన్మలో రెజ్లర్ అయి ఉంటుంది.అందుకే ఇప్పుడు ఇది ఇలా అద్భుతంగా ఫైటింగ్ మూవ్స్ ప్రదర్శిస్తోంది” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇదే వీడియో కింద కొందరు నెటిజన్లు మరిన్ని ఫన్నీ వీడియోలు పంచుకుంటున్నారు.
ఈ ట్వీట్ పోస్ట్ కింద మీరు వాటిని వీక్షించవచ్చు.