Biggboss geethu : బిగ్ బాస్ ఆటపై మళ్లీ అనుమానాలు.. ఎలిమినేషన్ లో అన్యాయం ఉందా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి గీతూ రాయల్ ఎలిమినేట్ అవ్వడం అందరినీ కలచి వేసింది.ఇప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది వెళ్లి పోయారు.

 Social Media Trolls On Biggboss And Star Maa Tv ,biggboss , Geethu , Elimination-TeluguStop.com

అందులో చలాకి చంటి, సూర్య మరియు గీతూ రాయల్ కూడా ఉన్నారు.వీరు ముగ్గురు కాకుండా మరో ఇద్దరు ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ వెళ్లి పోయారు అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం హౌస్ లో ఉన్న మెరీనా, రోహిత్, రాజ్, ఆదిరెడ్డి లతో పాటు ఇంకొందరు కూడా వెళ్లి పోయిన వారితో పోలిస్తే చాలా వీక్ కంటెస్టెంట్స్.అయినా కూడా వారిని బిగ్ బాస్ కొనసాగిస్తూ వీరిని ఎలిమినేట్ చేయడం ఎందుకు అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు.

ప్రేక్షకుల పేరు చెప్పి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం ద్వారా ఆట లో ఏం చూపించాలని భావిస్తున్నారు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు కొందరు నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ యొక్క రేటింగ్ దారుణంగా పడి పోయింది.

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్‌ చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.అయినా కూడా గీతూ రాయల్‌ వంటి వారియర్ ప్లేయర్ ని ఎలిమినేట్ చేయడంతో కచ్చితంగా రేటింగ్ మరీ దారుణంగా పడి పోయే అవకాశం ఉంది అంటూ ప్రేక్షకులతో పాటు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Adireeddy, Bb, Biggboss, Geethu, Marina, Nagarjun, Rohit, Telugu Biggboss

గీతూ వంటి ప్లేయర్ ని ఓట్లు తక్కువ వచ్చిన కూడా కొనసాగించాల్సి ఉంటుందని.గతం లో ఎంతో మంది కంటెస్టెంట్స్ ని ఓట్లు రాకున్నా కూడా కొనసాగించారని అదే విధంగా ఈమె ని కూడా కొనసాగిస్తే ఆట మరింత రసవత్తరంగా సాగేది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్బాస్ నుండి గీతూ రాయల్‌ వెళ్లి పోవడం ను చాలా మంది అన్యాయంగా ఫీల్ అవుతున్నారు.కేవలం గీతూ రాయల్‌ విషయం లోనే కాకుండా ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ విషయంలో కూడా ప్రేక్షకులు అసహనం తో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube