New bikes November ; నవంబర్‌లో రిలీజ్ కానున్న బైకులు, స్కూటర్స్ ఇవే..

ఇండియాలో టూవీలర్ మార్కెట్‌లో నిత్యం నెలకొనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, అనేక బ్రాండ్‌లు భారతదేశంలో తమ కొత్త బైక్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఆటోమొబైల్ వర్గాల ప్రకారం, నవంబర్ 2022లో భారతదేశంలో కొన్ని కొత్త బైక్‌లు, స్కూటర్లు రిలీజ్ అవుతాయి వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

 These Are The Bikes And Scooters That Will Be Released In November New Bikes, M-TeluguStop.com

హీరో మాస్ట్రో జూమ్ 110

హీరో మాస్ట్రో జూమ్ 110 ఈ నెలలో ఇండియాలో లాంచ్ అవుతుంది.ఇది మార్కెట్లో స్పోర్టీ 110 cc స్కూటర్‌గా వస్తుంది.

మాస్ట్రో ఎడ్జ్ 125 వంటి ఫీచర్స్ ఇందులో అందించే అవకాశం ఉంది.ఇది మాస్ట్రో ఎడ్జ్ 110 వలె అదే ఇంజన్‌తో వస్తుంది.

అల్ట్రావయోలెట్ F77

Telugu Automobile, Maestro Edge, Motorcyles, Royalenfield, Scooters, Ultraviolet

కొత్త అల్ట్రావయోలెట్ F77 ధర రూ.3 లక్షల కంటే ఎక్కువ (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.ఇది ఈ నెలలో దేశంలో విడుదల కానుంది.ఇది దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌గా రిలీజ్ కానుంది.స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మిటియార్ 650

Telugu Automobile, Maestro Edge, Motorcyles, Royalenfield, Scooters, Ultraviolet

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటోర్ 650 నవంబర్ 8, 2022న రానుంది. నవంబర్ 18న రైడర్ మానియాలో భారతదేశం దీనిని పరిచయం చేస్తుంది.సూపర్ మిటియార్ 650, షాట్‌గన్ 650 బైక్స్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 వంటి ఇతర 650cc బైక్‌ల వలె ఒకే విధమైన ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రైన్లపై రిలీజ్ చేస్తున్నారు.

• టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ

టీవీఎస్ కంపెనీ ఈ నెలలోనే అపాచీ ఆర్టీఆర్ 160 4వీ అప్‌డెటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది.

ఈ బైక్ టెస్టింగ్ ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతోంది.హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ కూడా ఇదే నెలలో రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube