హీరో గా వెంకటేష్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య కాలం లో ఆయన సినిమా లు ఎక్కువ చేయక పోవడం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన తోటి హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మరియు నాగార్జున లు వరుసగా సినిమా లు చేస్తున్న కూడా వెంకటేష్ మాత్రం సినిమా లు చేయక పోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వరుసగా సినిమా లు చేయాలని సీనియర్ హీరో వెంకటేష్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వం లో వెంకటేష్ సినిమా కన్ఫర్మ్ అయింది అంటూ సమాచారం అందుతోంది.
సినిమా ను ప్రముఖ తెలుగు నిర్మాత నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సమయం లోనే వెంకటేష్ తో వెంకీ కుడుముల చేయబోతున్న సినిమా గతం లో మెగాస్టార్ చిరంజీవి తో చేయాలనుకున్నాడని రెండు మూడు సార్లు వెంకీ కుడుముల వెళ్లి మెగాస్టార్ చిరంజీవి ని కలిశారని కథ చర్చలు జరిగాయని సమాచారం అందుతుంది.కానీ చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ కారణంగా వెంకీ కుడుములను దూరం పెట్టాడు.దాంతో దర్శకుడు వెంకీ వెళ్లి హీరో వెంకీ నేను కలవడం.
ఆ వెంటనే ఓకే చెప్పడం స్టోరీ మరియు స్క్రీన్ ప్లే విషయం లో వెంకీ కుడుముల చాలా ఈజీగానే వెంకటేష్ ని సంతృప్తి పరచడం తో సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ సమాచారం అందుతుంది.విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కి వినిపించిన కథ నే ఇప్పుడు వెంకటేష్ తో చేయబోతున్నాడని కూడా సమాచారం అంది.
ఈ విషయం లో మరింత క్లారిటీ రావడానికి మరో రెండు మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.







