కోలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సత్తా చ్ఝాటుతున్న భామ వరలక్ష్మి శరత్ కుమార్.స్టార్ తనయురాలైనా సరే ఆమె హీరోయిన్ గా కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తుంది.
తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మ రోల్ లో అదరగొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత అల్లరి నరేష్ నాందిలో కూడా లాయర్ పాత్రలో అదరగొట్టింది.ఇక ఇప్పుడు సమంత నటించిన యశోద సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.
ఈ సినిమాలో కూడా వరలక్ష్మి తన పాత్రలో అలరిస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాతో పాటుగా క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న వీర సింహా రెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది.
ఈ సినిమాలో బాలయ్య ముందు ఐదు పేజీల డైలాగ్ తో అదరగొట్టిందట వరలక్ష్మి.ఆ డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో ఫినిష్ చేసిందట.తెలుగు అంతగా రాకపోయినా వరలక్ష్మి పెట్టిన ఎఫర్ట్స్ కి బాలయ్య కూదా మెచ్చుకున్నారట.అంతేకాదు చిత్రయూనిట్ కూడా వరలక్ష్మి డెడికేషన్ కి సూపర్ అనేస్తున్నారు.
ఇది తెలిసిన ఆడియన్స్ మాత్రం వావ్ వరలక్ష్మి వావ్ అనేస్తున్నారు.