ఒక సినిమా పరిపూర్ణం కావాలంటే సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్ల పాత్ర కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది.ఇలా హీరో హీరోయిన్లతో సమానంగా కమెడియన్ పాత్రలను కూడా సృష్టిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన కమెడియన్లు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పాలి.ముఖ్యంగా నిన్నటి తరం కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలా సీనియర్ కమెడియన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో కళ్ళు చిదంబరం ఒకరు.
ఈయన కళ్ళు అనే నాటకాన్ని వేస్తున్న సమయంలో ఎంవి రఘు ఈ నాటకాన్ని చూసి చిదంబరాన్ని కళ్ళు అనే సినిమాలో కమెడియన్ గా తీసుకున్నారు.
ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయన పేరు ముందు కళ్ళు అనే పేరు అలాగే పడిపోయింది ఇలా చిదంబరం కాస్త ఈ సినిమా ద్వారా కళ్ళు చిదంబరంగా మారిపోయారు.కళ్ళు చిదంబరం నాటకాలు వేస్తూ సరిగా తిండి తినక సరైన నిద్ర లేక తన కంటిలో నరాలు పక్కకు కదలడంతో ఆయనకు మెల్లకన్ను వచ్చింది.
అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత ఆయన ఆపరేషన్ ద్వారా తన కన్ను బాగు చేయించుకోవాలని భావించారు.

ఈ విధంగా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఈయనకు వరుస అవకాశాలు రావడంతో తన మెల్ల కన్ను తనకు అదృష్టంగా ఉందని భావించి ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే ఉండిపోయారట.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కోట్ల రూపాయల సంపద కూడా పెట్టినప్పటికీ ఆ మెల్లకన్ను తనకు అదృష్టం తీసుకురావడంతో ఆ కంటికి ఆపరేషన్ చేయించకుండా ఉన్నారని తెలుస్తుంది.ఇక ఈయన సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగడమే కాకుండా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, కళాకారులను ప్రోత్సహించారు.







