టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం హిట్.ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.ఆ సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని తెలిపాడు దర్శకుడు శైలిష్ కొలను.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ హిట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో మీనాక్షి చౌదరి కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ సినిమాను డిసెంబర్ రెండవ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు చిత్ర బృందం.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.ఈ టీజర్ లో ఎక్కువగా అడవి శేష్ క్యారెక్టర్ గురించి చూపించారు.
కేసు మొదలుపెట్టకు ముందు అడవి శేషు ఇంట్రో, సినిమాలో అడవి శేషు ఏ విధంగా ఉంటాడు అన్నది చూపించారు.

అలాగే ఒక అమ్మాయి మర్డర్ కేసుతో సెకండ్ కేసు మొదలవుతుంది అని తెలిపారు.కానీ ఇందులో ఎటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మాత్రం టీజర్ లో చూపించలేదు.పోలీస్ అధికారిగా అడవి శేషు నటన ఆకట్టుకునే విధంగా ఉంది.
అయితే చిత్ర ఎమోషన్స్ లో భాగంగా చెబుతున్నదాన్ని బట్టి చూస్తుంటే టీజర్ లో చూపించకుండానే మొత్తం అన్ని సినిమా ధియేటర్ లో చూసుకోండి అన్నట్టుగా లీడ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఈ సినిమా కచ్చితంగా ఫుల్ సస్పెన్స్ త్రిల్లింగ్ అంశాలతో ఉండబోతోంది అని తెలుస్తోంది.







