విసుగు వచ్చినప్పుడు ఎవరైనా సాధారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వంటివి చూస్తుంటారు.ఇంకొందరు పుస్తకాలు చదువుతుంటారు.
ఇంకా బోర్ కొడితే బయటకు వెళ్లి తిరిగి వస్తుంటారు.అయితే బ్రిటన్‌కు చెందిన ఈ వ్యక్తి కొంచెం ఆశ్చర్యకరమైన పని చేశాడు.ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన డేనియల్ ఎమ్లిన్-జోన్స్ తన ‘విసుగు’ కారణంగా ఇంట్లోనే విస్మయకర పని చేస్తున్నాడు.‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మొక్క’ను పెంచుకుంటున్నాడు.ఆస్ట్రేలియా మరియు మలేషియాలో పేరుమోసిన ‘డెండ్రోక్నైడ్ మోరోయిడ్స్‘ అనే మొక్క అది.‘జింపీ-జింపీ’ లేదా ‘సూసైడ్ ప్లాంట్’ అని కూడా పిలువబడే మొక్క ఆత్మహత్య ఆలోచనలను రేకెత్తిస్తుందని చెబుతున్నారు.అలాంటి మొక్కను అతడు పెంచుకోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

జింపీ-జింపీ మొక్క గుచ్చుకుంటే చర్మంపై వాపు బాగా ఉంటుంది.అయినప్పటికీ, ఎమ్లిన్-జోన్స్ ఆ మొక్కను మానవ స్పర్శ నుండి దూరంగా ఉంచడం గురించి జాగ్రత్తగా ఉంటాడు.అతను దానిని ఒక బోనులో ఉంచాడు.దానిపై ప్రమాద సూచిక వ్రాసాడు.“నేను ఎల్లప్పుడూ మొక్కలను ఇష్టపడతాను, నేను జెరేనియంలతో కొంచెం విసుగు చెందాను.ఇంటర్నెట్ ప్రకారం, ఆదిమవాసులు ఆర్థరైటిస్ చికిత్సలో సహాయపడటానికి దీనిని ఉపయోగించారు.అది ఎంతవరకు నిజమో, లేదా అది ఎలా పని చేస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు.” అతను పేర్కొన్నాడు.ఈ మొక్కను ముట్టుకున్న బాధితులకు కాళ్లు వాపు, అలెర్జీలు, తుమ్ములు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఉంటాయి.జింపీ-జింపీ మొక్కను ‘ఆస్ట్రేలియన్ స్టింగ్ ట్రీ’ అని కూడా పిలుస్తారు.
ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క.ఈ మొక్క మిమ్మల్ని ఎంతలా బాధ పెడుతుందంటే వేడి యాసిడ్‌తో కాల్చబడినంత బాధగా ఉంటుంది.
అదే సమయంలో విద్యుదాఘాతానికి గురైనట్లు కూడా అనిపిస్తుంది.అలాంటి మొక్కను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ వ్యక్తి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







