ఒకపక్క మునుగోడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.మరోపక్క చూస్తే ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు ?;ఎంత మెజారిటీ వస్తుంది ? ఇలా అనేక వాటిపై బెట్టింగుల జోరు తీవ్రతరం అయ్యింది.ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిక్షణాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో ఎవరికివారు భారీగానే సొమ్ములు ఖర్చు పెట్టారు.నగదు , వస్తు రూపంలో ఓటర్లకు ప్రధాన పార్టీలు అన్ని పంచిపెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుందని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి.
అందుకే మునుగోడుపై ఈ స్థాయిలో ఫోకస్ పెట్టాయి .దీంతో ఇక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను బెట్టింగ్ రాయుళ్లు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.అభ్యర్థి బల,బలగాలను అంచినావేస్తూ వారికి ప్రజల్లో ఉన్న సానుకూలతలు, వ్యతిరేకతలను లెక్కల్లోకి వేసుకుని బెట్టింగులకు దిగుతున్నారు.వెయ్యి కి రెండు వేలు, లక్షకు రెండు లక్షలు అంటూ పెద్ద ఎత్తున బెట్టింగులకు దిగుతున్నారు.
ఈ బెట్టింగ్ లలో వివిధ పార్టీలకు చెందిన వారు మాత్రమే కాకుండా, తటస్తులు ఉద్యోగులు ఐటి ఉద్యోగులు ఇలా ఎంతోమంది అభ్యర్థుల గెలుపు మెజారిటీల పైన పందాలకు దిగుతున్నారట.

డిపాజిట్ కోల్పోయేవారు ఎవరు అనేదానిపైనా బెట్టింగులు సాగుతున్నాయట.దీంతో పోలీసులు సైతం ఈ బెట్టింగుల నిర్వహణపై గట్టిగానే నిఘా పెట్టారు.కోట్లలో సొమ్ములు చేతులు మారే అవకాశం ఉండడంతో ఎన్నికల ఫలితాల వరకు అనుమానస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు.
అలాగే ఆన్లైన్ ద్వారా బెట్టింగులు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.అయితే వీటిని ఎక్కువగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడే ముఠాలే నిర్వహిస్తుండడం, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఇందులో ప్రమేయం ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.