తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడనీ అరెస్టు చేసిన సిఐడి పోలీసులు గురువారం ఏలూరు కోర్టులో హాజరుపరచునున్నారు.ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగంతో అయ్యన్నపాత్రుడుతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ నీ కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
ఈ మేరకు అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులు పోలీసులు నమోదు చేయడం జరిగింది.

దీంతో ఏలూరు కోర్టులో ఆయనను ఈరోజు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మరోపక్క అయ్యన్నపాత్రుడు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి.జగన్ ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆరోపించారు.ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడం జరిగింది.పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.







