ప్రపంచంలో ఏ దేశమైన సరే వలసకు ప్రాధాన్యమిస్తూ నిపుణులైన వలస వాసులతో తమ దేశ ఆర్ధికాభివృద్ధిని పెంపొందించుకోవాలని అనుకుంటే ముందుగా రెడ్ కార్పెట్ పరిచేది మాత్రం భారతీయ నిపుణులకే.అమెరికా ప్రస్తుతం అగ్ర రాజ్య హోదాలో ఉందంటే అందుకు ప్రధాన కారణం ఎనో ఏళ్ళ క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడిన నైపుణ్యం కలిగిన భారతీయుల ప్రతిభే కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అందుకే ప్రస్తుతం అన్ని దేశాలు భారతీయ నిపుణులను తమ దేశం వైపు ఆకర్షించేందుకు ఎన్నో ప్రధకాలను, మరెన్నోఆకర్షణీయమైన సౌకర్యాలు, కల్పిస్తోంది.ఈ విషయంలో అమెరికా తరువాత కెనడా ముందుంది.
తాజాగా కెనడా ప్రభుత్వం తమ దేశం ఎదుర్కుంటున్న కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది.నిపుణులైన కార్మికుల తమకు కావాలంటూ కీలక ప్రకటన చేసింది.2025 నుంచీ ప్రతీ ఏటా సుమారు 5 లక్షల మంది కార్మికులను తమ దేశంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ప్రకటించింది.ఈ మేరకు కెనడా ఇమ్మిగ్రేషన్ కొత్త ప్రణాలికను రూపొందించింది.
గడిచిన ఏడాది మొదలు ఇప్పటి వరకూ సుమారు 4 లక్షల వీసాలు అందించినట్టుగా ఆ దేశ మంత్రి సీన్ ఫ్రెజర్ ప్రకటించారు.ఈ సంఖ్య 2023 నాటికి 4.50 లక్షలు దాటుతుందని తెలిపారు.
ఇక 2025 ఏడాది నుంచీ ప్రతీ ఏటా సుమారు 5 లక్షల మందికి ఆహ్వానం అందిస్తామని మంత్రి తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఖాళీలలో అత్యధిక శాతం ఎకనామిక్స్ కు సంభందించి ఉన్నాయని వీటిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం మేము ఎదుర్కుంటున్న కార్మికుల లేమి కారణంగా వలసలను ప్రోశ్చహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఈ భర్తీ చేయకపోతే ఆర్ధిక సామార్ధ్యం పెంచుకునే అవకాశం కోల్పోతామని నిపుణులు అంటున్నారు.
అయితే కెనడా తీసుకున్న ఈ నిర్ణయంతో నిపుణులైన భారతీయులకు మంచి ఆవకాశం ఉంటుందని, భారతీయులకు అత్యధికంగా మేలు జరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.