ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.రబీ సీజన్ లో ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.ఈ మేరకు రూ.51,875 కోట్ల విలువైన సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈబీపీ ప్రోగ్రామ్ కింద ఓఎమ్సీలు ఇథనాల్ కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది.అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు దోన్యి పోలో ఎయిర్ పోర్టుగా పేరు పెట్టడంపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.







