CP Mahesh Bhagavat: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపి మహేష్ భగవత్ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు...

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపి మహేష్ భగవత్ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.సిపి మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ… ఈ ఉప ఎన్నికల్లో చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసాం.

 Cp Mahesh Bhagavat Meeting With Police Staff At Choutuppal Municipal Center Deta-TeluguStop.com

మొదటిసారిగా ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారు.పంతంగి టోల్ ప్లాజా, తూప్రాన్ పేట, దామెర దగ్గర ప్రధాన చెక్ పోస్ట్ లో సిఆర్పిఎస్సి బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాం.

రౌడీషీటర్స్ గత ఎన్నికల్లో నేరస్తులని బైండోవర్ చేయడం జరిగింది.నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది.1000లీటర్ల లిక్కర్, ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.

చెక్ పోస్ట్ల దగ్గర పొద్దున రాత్రి చెకప్ చేయడం జరుగుతుంది.

ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది.ప్రతి పోలింగ్ స్టేషన్లో లైవ్ కవరేజ్ ఉంటుంది.

ప్రతి పోలింగ్ బూత్ కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికారిని నియమించాం.రెండువేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసాం.

ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 గాని, 9490617117సమాచారం ఇవ్వండి.

ప్రచార సమయంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది, బైండోవర్ కూడా చేసాము.

ఇన్విగేస్ట్రేషన్ చేసి చర్యలు వారి మీద తీసుకోవడం జరుగుతుంది.ఎలక్షన్స్ అయిపోయినంతవరకు తనిఖీలు జరుగుతాయి.సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ డే వరకు బందోబస్తుంటుంది.నాన్ లోకల్ వాళ్ళు నిన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి ఒకవేళ అలా వెళ్ళిపోని వాళ్ళు ఉంటే తక్షణమే వెళ్ళిపోండి.

కేసులు నమోదు చేయడం జరుగుతుంది, వాళ్ళ వెహికల్స్ సిజ్ చేయడం జరుగుతుందని తెలిపిన సిపి మహేష్ భగవత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube