ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతానికి భిన్నంగా జనసేన పార్టీ బలపడుతున్న సంగతి తెలిసిందే.ప్రజా పోరాటాలు చేస్తూ మరో పక్క ప్రభుత్వాన్ని నిలదీసే రీతిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.“జనవాణి” పేరిట ప్రజల ఇబ్బందులను తెలుసుకోవటానికి జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ రీతిగా జనసేన పార్టీ బలపడుతూ ఉన్న తరుణంలో కుప్పం జనసేన ఇన్ చార్జి మద్దిరాల వెంకటరమణ .తన పదవికి మరియు పార్టీకి రాజీనామా చేసి పార్టీ హైకమాండ్ ఇంటికి ఊహించని షాక్ ఇచ్చారు.
2019 ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున వెంకటరమణ కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.ఓడిపోయిన గాని పార్టీ పరంగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.కుప్పం నియోజకవర్గం అభివృధి కోసం పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న పీఏసీ కమిటీ తనని పట్టించుకోవటం లేదని.
ఆవేదన వ్యక్తం చేసి పార్టీకి మరియు పదవికి రాజీనామా చేసేశారు.







