ప్రతీ వ్యక్తికి ఓటు అనేది ముఖ్యమైన ప్రాధమిక హక్కు, తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలకు ఉన్న ఏకైక అస్త్రం ఓటు హక్కు మాత్రమే.ఎన్నికల సమయంలో ఓటు వేసి తమకు నచ్చిన నాయకుడిని గెలిపించుకోవాలని ఎంతో మంది ఆరాటపడుతారు.
ఓటరు లిస్టు లో తమ పేరు లేకపోతే నమోదు చేయడం కోసం అధికారులను సంప్రదించి మరీ ఓటరుగా నమోదు చేయించుకుంటారు.అయితే చాలా మంది ఓటు వినియోగంలో అశ్రద్ద కనబరించినా మెజారిటీ ప్రజలు మాత్రం ఓటు వినియోగంలో ముందుంటారు.
ఈ కోవలోనే తాము దేశం విడిచి వెళ్ళినా సరే మాకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించండి అంటూ ఎన్నారైలు కేంద్రానికి ఎన్నో సార్లు వినతులు అందించారు, కోర్టులను ఆశ్రయించారు.ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
వలస కార్మికులకు ఓటు హక్కు కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లుగా కేంద్రం సుప్రీంకోర్టు కు వివరణ ఇచ్చింది.ఎన్నారైలు కూడా ఓటు వేసేందుకు హక్కు ఉన్నవారేనని, వారికి రహస్య ఓటింగ్ కల్పిస్తూనే ఓటు హక్కు కల్పిస్తామని అటార్నీ జనరల్ వెంకట రమణి ప్రకటించారు.
సుమారు.
10 ఏళ్ళ క్రితం లండన్ లో ఉండే ఓ ఎన్నారై తమకు కూడా ఓటు హక్కు కల్పించాలని కేంద్రం తమకు ఆ అవకాశం కల్పించడం లేదని భారత్ లోని కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేసారు.
దాంతో ఈ పిటిషన్ పై అధ్యయనానికి కోర్టు సుమారు 12 మందితో కలిసి ఓ కమిటిని ఏర్పాటు చేసింది.దాంతో ఆ కమిటి ఎన్నారైల ఓటు హక్కుపై అనుకూలంగా నివేదిక అందించింది.
కాగా ఈ నివేదికను కేంద్రం 2018 లో బిల్లుగా మార్చి లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది.అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టక పోవడంతో చట్టంగా మారలేదు, కాగా ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఈ విషయంపై కేంద్రం స్పందిస్తూ తాము ఎన్నారైల ఓటు హక్కు కు సానుకూలంగా ఉన్నామని అందుకు తగ్గ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.







