తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు.
ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్.ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో పాటుగా కుటుంబ కథ చిత్రాలను కూడా నటించి మెప్పించాడు.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించాడు.లేకపోతే ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే హీరోగా సుమన్ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.
ఈ నేపథ్యంలోనే కొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించారట.
ఆ సమయంలో ఆయన ఎంతో కృంగిపోయినట్లు ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ ఆ విషయం గురించి మాట్లాడారు.
తన కెరియర్ లో ఏ హీరో హెల్ప్ చేయలేదని, కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రమే కష్టకాలంలో ఆదుకున్నట్లు తెలిపారు.కానీ సుమన్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో హీరోల వైపు నుంచి ఎటువంటి సహాయం లభించలేదట.
హీరోయిన్లు సుమన్ కోసం స్టాండ్ తీసుకున్నారట.

ఒకప్పటి హీరోయిన్లు అయినా సుమలత సుహాసిని భానుప్రియ లాంటి హీరోయిన్లు సుమన్ చాలా మంచి వ్యక్తి క్రమశిక్షణతో ఉండేవాడు అంటూ సుమన్ గురించి స్టేట్మెంట్ ఇవ్వడం అతనికి ఎంతో ప్లేస్ అయిందట.సుమన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ హీరో వద్దకు వెళ్లి సహాయం కోరలేదు అని చెప్పుకొచ్చాడు హీరో సుమన్.కానీ దేవుడి దయవల్ల సుమన్ కి మంచి మంచి అవకాశాలు వచ్చి హీరోగా తన సత్తాను నిరూపించుకున్నాడు.
పెద్ద పెద్ద హీరోలతో కలిసి చేసినప్పుడు వారి సలహాలు సూచనలు మాత్రమే తీసుకునే వాడిని.ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలుకుబడి ఉపయోగించుకోలేదు అని చెప్పుకొచ్చాడు సుమన్.







