ఆర్ నారాయణ మూర్తి. కేవలం సినిమా కోసం, జనం కోసం పుట్టిన వ్యక్తి.
కాదు కాదు అతడొక శక్తి.స్టార్ నటి నటులు ఎందరో ఉన్న కూడా ఆయనను మాత్రమే చాల మంది మాటాడటానికి స్టేజి పై పిలుస్తారు.
ప్రత్యేక ఆహ్వానం పంపిస్తారు.సినిమాలను సినిమా తీస్తూ కోట్లు సంపాదిస్తున్న ఎంతో మంది ఆయనను చూసి సిగ్గు తెచ్చుకోవాలి.
సంపాదించే ప్రతి రూపాయి జనం కోసం ఖర్చు చేసే మహనీయుడు.బడుగు, బలహీన వర్గాల కోసం మాత్రమే సినిమాలు తీస్తాడు.
కోట్లు కుమ్మరిస్తాను అన్నాకూడా అయన కమర్షియల్ సినిమాల్లో నటించారు.అందుకు ఉదాహరణ అయన వదిలేసినా టెంపర్ సినిమాలోని పోసాని కృష్ణ మురళి పాత్రా.
ఎన్టీఆర్ స్వయం గా అడిగిన కూడా అయన ఒప్పుకోలేదంటే అయన విలువలు ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.
కేవలం సినిమాల్లో నటిస్తే సరిపోదు అందుకే ఆయనే కథ, కథనం, దర్శకత్వం, సంగీత,గానం, చివరికి నిర్మాణం కూడా చేస్తాడు.
ఒక సినిమా తీయాలంటే ఆయనకు కోట్లు అవసరం లేదు.పది లక్షలు ఇచ్చిన చాలు.24 శాఖలు తన భుజాల పైన మోసి సినిమాను తీసి మినిమమ్ గ్యారంటీ చిత్రం గా విడుదల చేయగల సమర్థుడు.అందుకే అయన సినిమాలు ఏవి ఫ్లాప్ కావు.
ఆలా అని పెద్ద ప్లానింగ్ తో కూడా సినిమాలు తీయడు.తానే నిర్మించి తానే అన్ని చేస్తాడు.
ఇక సేవ చేయాలన్న, దానాలు చేయాలన్న తెలుగు సినిమా నుంచి ముందు ఉండే వ్యక్తి నారాయణ మూర్తి.

అయన చేసిన గుప్త దానాల గురించి ఏ పేపర్ లోను రాదు, ఎక్కడ చదవరు.ఆయనకు ప్రచారం అవసరం లేదు.ఒక రోజు తుఫాన్ బాధితుల కోసం సినిమా సెలబ్రిటీస్ అంత ఒక క్రికెటర్ బ్యాట్ వేలం పాట లో పాల్గొన్నారు.
చిరంజీవి నుంచి ఎంతో మంది పెద్దలు ఆ వేలం పాటలో పాల్గొంటే అందరు 5 వేలు, పది వేలు అని పాడుతుంటే గంభీరమైన గొంతు తో తన అకౌంట్ లో ఉన్న 5 లక్షలతో ఒకే మాట చెప్పి బ్యాట్ ని సొంతం చేసుకొని స్టార్ హీరోలందరి మొహాలు మాడిపోయేలా చేసాడు.

ఇక తల్లిని ఏం కావాలో కోరుకో అమ్మ అని అడిగితే ఆ తల్లి తన కోసం ఏమి అడగకుండా ఊరి కోసం రామాలయం కట్టించమంటే తన సొంత డబ్బుతో కట్టించాడు.ఇక ఆంజనేయ స్వామి గుడికి, స్కూల్ కోసం భారీగా విరాళం కూడా ఇచ్చాడు.అలాగే తన వాటా కింద వచ్చిన 12 ఎకరాల భూమిని సైతం ప్రజలకు పంచి పెట్టిన మహనీయుడు ఆర్ నారాయణ మూర్తి.
కోట్ల రూపాయలు ఉంటె ఎవరైనా దానాలు చేస్తారు.కానీ చేతిలో ఉన్న ఆఖరు రూపాయి ని సైతం దానం చేసేవాడే గొప్పవాడు.అలాంటి వాళ్లలో నారాయణ మూర్తి తప్పకుండ ఉంటాడు.







