టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సమంతకు.గత సంవత్సరం నుంచి కలిసి రావట్లేదు.వ్యక్తిగతంగా సమంత చాలా బాధలను మోస్తుంది.కానీ అవి బయటికి చూపించకుండా ధైర్యంగా కనిపిస్తుంది.పైగా తాజాగా తను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం కూడా తెలిసిందే.దీంతో తనపై మరింత సింపతి పెరిగింది.
నిన్నటి వరకు సమంతను చాలామంది టార్గెట్ చేశారు.
ఏడాది క్రిందట తను నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.
అప్పటివరకు సమంతకు మంచి గౌరవం ఉండేది.కానీ ఎప్పుడైతే నాగచైతన్యను విడిపోయిందో అప్పటినుంచి తనను తెలుగు ప్రేక్షకులు బాగా టార్గెట్ చేశారు.
మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంటూ బాగా కామెంట్స్ పెట్టారు.ఇప్పటివరకు నీపై మంచి గౌరవం ఉండేదని.
ఇలా చేయటంతో నీపై గౌరవం పోయింది అంటూ చాలామంది విమర్శలు చేశారు .
అయినా కూడా సమంత అవన్నీ ఎదుర్కొని ధైర్యంగానే నిలబడింది.కానీ తాను ఎందుకు విడిపోయిందన్న విషయం మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు.అటువైపు అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ విషయం గురించి తెలుపలేదు.దీంతో నాగచైతన్య, సమంత ఇద్దరూ ఎవరి జీవితాలు వారివే అన్నట్లుగా కొనసాగిస్తున్నారు.వచ్చిన అవకాశాలకు సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు.

సమంత మాత్రం తెలుగులోనే కాదు తమిళ, హిందీలో కూడా బాగా అవకాశాలు అందుకుంటుంది.ఆ మధ్య విడుదలైన పుష్ప సినిమాలో ఐటమ్ గర్ల్ గా కూడా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం తన ఖాతాలో వరుస పాన్ ఇండియా మూవీలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.ఇప్పటికే తను షాకుంతలం, యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక యశోద సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.హరి, హరిష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా వచ్చాయి.ఇక సినిమా విడుదలకు దగ్గరలో ఉన్న సమయంలో ప్రేక్షకులలో కూడా ఈ సినిమా పట్ల బాగా ఆత్రుత చూపిస్తున్నారు.

కానీ అంతలోనే సమంత పిడుగు లాంటి వార్త చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.రెండు రోజుల కిందట తను తన సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలియజేసింది.మయోసైటిస్ అనే వ్యాధితో సమంత పోరాటం చేస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులంతా షాకయ్యారు.
త్వరలోనే కోలుకుంటావు అని తనకు ధైర్యం ఇచ్చారు.
ఒక వైపు సమంత ఈ వ్యాధితో బాధపడుతూ ఉండగా మరో వైపు తన సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.ఇక సినిమా దగ్గరకు వస్తున్న సందర్భంగా ప్రమోషన్స్ జరగాలి.
కానీ సమంత పరిస్థితి అలా ఉండటంతో ప్రమోషన్స్ కూడా కనిపించడం లేదు.కానీ సోషల్ మీడియా వేదికగా సమంతకు వచ్చిన వ్యాధి గురించి సిని ప్రముఖులంతా పోస్టులు పెడుతూ సానుభూతి చూపిస్తుండగా కొందరు ఈ పోస్టులే సమంత సినిమాకు ప్లస్సుగా మారనున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

ఓ వైపు ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, కొన్ని సినిమాకు సంబంధించిన విషయాలను సమంత అభిమానులు ట్రెండ్ గా మారుస్తున్నారు.దీంతో సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు అభిమానులే మోస్తున్నారు.అలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలలో పెడుతూ బాగా ట్రెండ్ చేస్తున్నారు.దీంతో సమంతకు ఈ పరంగా సింపతి తో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా నడుస్తున్నాయని అర్థమవుతుంది.







