ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తంగెళ్ల శివప్రసాద్ కోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.ఎమ్మెల్యేలుతో పాటు సామాన్యుల ఫోన్లను సైతం తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో విచారణకు స్వీకరించిన ధర్మాసనం.పిల్ ను నవంబర్ 4న విచారిస్తామని స్పష్టం చేసింది.







