టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజు ఒక ప్రోగ్రాం లో గెస్ట్ గా పాల్గొన బోతున్నారు.కర్ణాటకలో జరగనున్న కీలక కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.
మరి ఆ ప్రోగ్రాం ఏంటి అంటే.కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఒక స్మరణ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక ఈ కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం మన హీరో ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
మరి ఈ ప్రోగ్రాం లో పాల్గొన బోతున్న ఎన్టీఆర్ స్పీచ్ ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా ఈ ఎమోషనల్ డేలో ఎన్టీఆర్ పునీత్ కు తనకు మధ్య ఉన్న బంధాన్ని ఎలా తెలుపుతాడో అని కన్నడ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.ఇతడు ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఎన్టీఆర్ కొరటాల శివతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.
ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై అంచనాలను పెంచేసాడు.
దీంతో ఫ్యాన్స్ వెయిటింగ్ మరింత ఎక్కువ అయ్యింది.కానీ వీరి ఎదురు చూపులు ఫలించడం లేదు.ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టు టాక్.
మరి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందా అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.