ప్రకృతి మనల్నీ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.అద్భుతమైన మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన జలపాలు, నదులు, చెట్లు ఇలా కన్నులకు కనువిందుగా అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది.
అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అయింది.చాలా రోజుల క్రితం అప్లోడ్ చేసిన ఈ వీడియో.
ఇప్పుడు ట్రెండింగ్‌గా నిలిచింది.ప్రకృతి పరవళ్ల మధ్య పెరూలోని ‘రెడ్ రివర్’ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
దక్షిణ అమెరికాలోని లోయ గుండా ఈ నది పరుగులు తీస్తోంది.
సాధారణంగా ఏ నది నీళ్ల రంగైనా నీలి రంగు లేదా గోధుమ రంగులో ఉంటాయి.
కానీ పెరులో ఉన్న రెడ్ రివర్ నీళ్లు గులాబీ రంగులో ఉన్నాయి.అయితే ఈ నది శిలా పర్వతాల గుండా ప్రవహిస్తుంటుంది.దీంతో ఈ నీటికి గులాబీ రంగు వస్తుందని, అలాగే కొద్ది దూరం వెళ్లాక ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రవహించింది.ఐరన్ ఆక్సైడ్ సమృద్ధిగా ఉండే ఎర్ర ఇసుక రాయి నీటిలో చేరడం వల్ల ఎరుపు రంగులోకి మారుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
ఈ అద్భుతమైన వీడియోను ‘మూన్’ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను 3.6 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి.అలాగే 1,307 లైక్స్ వచ్చాయి.
అయితే ఈ వీడియోను మనం ఒక్కసారి చూసినట్లయితే.కొండలు, కోనల మధ్య, రాళ్లు.
రప్పలను చీల్చుకుంటూ రెడ్ రివర్ ప్రవహిస్తోంది.గులాబీ రంగులో ఉన్న నీళ్ల మధ్యలో ప్రవాహం వల్ల వచ్చిన తెలుపు రంగు ప్రకృతి ప్రేమికులను ఎంతకానో ఆకట్టుకుంటుంది.
అయితే ఈ నీటిలో ఎమైనా కెమికల్స్ ఉండొచ్చని, అందుకే నీటి రంగు మారి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ విజువల్స్ పుచ్చకాయను పోలి ఉన్నాయని చెబుతున్నారు.
ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.