Miranda Dixon Paintingdoor: షాకింగ్ ఘటన: ఇంటి తలుపులకు రంగులేసినందుకుగాను రూ.19 లక్షల జరిమానా విధించారు పాపం!

అవును, మీరు విన్నది నిజమే తలుపు కారణంగా ఓ యువతికి భారీ నష్టం జరిగిందనే చెప్పుకోవాలి.ఆమె తన ఇంటి తలుపు రంగు మార్చినందుకుగాను లక్షల్లో జరిమానా కట్టాల్సి వచ్చింది.

 Shocking Incident A Fine Of Rs 19 Lakh Was Imposed For Painting The Doors Of The-TeluguStop.com

వినడానికి చాలా విడ్డురంగా వుంది కదూ.కానీ ఇది నిజమే.కాగా ఈ విషయంలో ఆమెకి మద్దతు లభిస్తోంది.సోషల్ మీడియా వేదికగా ఆ యువతికి పలువురు మద్దతు తెలుపుతున్నారు.ఎడిన్‌బర్గ్‌లోని న్యూటౌన్‌లో నివసించే మిరాండా డిక్సన్, కేవలం తన ఇంటి తలుపు రంగుని మార్చినందుకుగాను చిక్కుల్లో పడింది.

ఈ క్రమంలో మిరాండా 19 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

ఆ ఇల్లు మిరాండాకు 2019లో తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా లభించింది.వారిపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ జరిమానా విధించడం జరిగింది.

ఈ మేరకు.అక్కడి స్థానిక ఎడిన్‌బర్గ్ సిటీ కౌన్సిల్ మాట్లాడుతూ.

ఇక్కడి భవనాల చారిత్రాత్మక లక్షణానికి అనుగుణంగా తలుపులకు రంగులు వేయడం వల్ల వారికి జరిమానా విధించినట్లు క్లారిటీ ఇచ్చారు.

Telugu Fine, Door, Latest-Latest News - Telugu

కాగా తన ఇంటి తలుపుపై ​ఫిర్యాదు కుట్రపూరితమైనదిగా జరిగిందని, కావాలనే చేసారని బాధితురాలు వాపోతోంది.సదరు ఇల్లు ఎడిన్‌బర్గ్ న్యూ టౌన్ వరల్డ్ హెరిటేజ్ పరిరక్షణ ప్రాంతంలో ఉందట.అందువల్ల, ఆ ప్రాంతంలోని ఆస్తులకు ఎలాంటి మార్పులు చేయాలనే కొన్ని నియమాలు అక్కడ ఉన్నాయి.

ఎడిన్‌బర్గ్‌లోని పాత, కొత్త పట్టణాలు 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందటం జరిగింది.ప్రణాళిక అనుమతి కోసం మహిళ దరఖాస్తు చేసుకోకపోవడం వలన ఆమెకి ఈ చిక్కులు వచ్చాయని స్థానికులు అంటున్నారు.

కాగా ఈ విషయంలో ఆమెకి మద్దతుగా నెటిజన్లు నిలుస్తున్నారు.చూడాలి మరి ఈ తంతు ఎక్కడికి వెళుతుందో?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube