బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది బాంబే బ్యూటీ రవీనా టాండన్. ఆమె సల్మాన్ ఖాన్ తో తొలిసారి హీరోయిన్ గా నటించి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
ఇక దాదాపు పదేళ్ల పాటు హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ ఎదిగింది.ఇక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసిన రవీనా కెజిఎఫ్ 2 సినిమాలో రమికా సేన్ పాత్రలో నటించింది.
ఈ సినిమా విజయవంతం కావం తో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది.ఇక సినిమాల విషయంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి గత జీవితంలో మాత్రం రవీనా టాండన్ అనేక వివాదాల్లో నిలిచింది.
ఇక రవీనా పెళ్లి కాకూండానే ఇద్దరిని దత్తత తీసుకోవడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.
రవీనా ప్రేమ వ్యవహారాలు కూడా తక్కువేమి కాదు.
ఆమె సినిమాల్లో నటిస్తున్నంత కాలం అనేక మంది తన తోటి హీరోలతో ప్రేమలో పడింది.కానీ ఆమె సీరియస్ గా తీసుకున్న రిలేషన్స్ మాత్రం ముగ్గురితో.
అందులో మొదటి హీరో అక్షయ్ కుమార్.వీరిద్దరూ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో డేటింగ్ చేయడం మొదలు పెట్టారు.
కొన్నాళ్ల పాటు అంత సాఫీగానే సాగిన కొన్ని కారణాల చేత వీరి బంధం ముందుకు వెళ్ళలేదు.ఆ తర్వాత రవీనా అజయ్ దేవగన్ తో ప్రేమలో పడింది.
వీరి బంధం దృఢంగానే ముందుకు వెళ్లిన కరిష్మా కపూర్ ఎంట్రీ తో సీన్ మొత్తం మారిపోయింది.
అజయ్ దేవగన్ కరిష్మా తో డేటింగ్ చేస్తూ రవీనా ను దూరం పెట్టడం మొదలు పెట్టాడు.అది భరించలేని రవీనా ఒక సారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందట.ఆ తర్వాత కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి తదనంతరం అనిల్ తడాని తో ప్రేమలో పడింది.
వీరిద్దరూ కొన్నాళ్ళు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.ఇక ఇప్పుడు ఈ జంట అన్యోన్యంగానే ఉంటుంది.
అంతే కాదు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం నలుగురు పిల్లల సంరక్షణ రవీనా నే చూస్తుండటం గమనార్హం.
ఇక తెలుగు లో ఎక్కువగా మోహన్ బాబు తో సినిమాలు చేసిన ఈ అమ్మడు చివరగా పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమాలో నటించింది.