Social Media: అన్ని విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు ఉందా.. జరిగే నష్టాలివే!

రానురాను పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి మంచితో పాటు చెడుని కూడా తీసుకువస్తోంది.అందుకే ఇక్కడ మనమే ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 Losses Of Having Habit Of Posting On Social Media Details, Social Media,all Pos-TeluguStop.com

డిజిటల్‌ యుగంలో ఓ వ్యక్తి ఇష్టాయిష్టాలు అనేవి తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు.అలాగే వారి బలహీనతలను కూడా ఇట్టే పట్టేయవచ్చు.

మన సోషల్‌ అలవాట్లను చూసే బ్యాంకులు మనకు లోన్లు ఆఫర్‌ చేస్తూ వుంటాయని విషయం మీలో ఎంతమందికి తెలుసు? మనకు తెలియకుండానే మన డిజిటల్‌ ఐడెంటిటీ, అలవాట్లు, ప్రవర్తన బేరీజు వేసుకుంటున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు.

ఇక అదే అంశాలు సైబర్‌ నేరగాళ్ళను పెచ్చుమీరేలాగా చేస్తున్నాయి.

ఒంటరిగా వున్న విధవులకు మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ పెట్టి మాయ చేస్తున్నారు.వ్యక్తిగత ఐడీకార్డులు, మాగ్నెటిక్‌ కార్డులు, కీ, పాస్‌వర్డ్స్‌ కూడా వారికి తెలుసుపోతున్నాయి అంటే మీరు అర్ధం చేసుకోండి.

అందుకే మనం సోషల్‌ మీడియాలో ఏం పోస్టు పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, అది ఎంతవరకు దారితీస్తుంది? లాంటి విషయాలపట్ల స్పృహ ఉండటం ఎంతో అవసరం.

సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టేముందు అలోచించి పెట్టడం మంచిది.

Telugu Cyber Crimes, Hackers, Latest, Loans, Habit, Tips-Latest News - Telugu

అది మీ వ్యక్తిగత సమాచారమైనా, తప్పుడు సమాచారమైనా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే మీలో కొందరు ప్రతీది సోషల్ మీడియాలో అప్‌డేట్‌ చేస్తూ వుంటారు.ఇది అస్సలు మంచిది కాదు.ఇక మీకు తెలియని కంటెంట్‌ను అస్సలు ఫార్వర్డ్‌ చేయొద్దు.ఒకవేళ మీరు సదరు విషయాన్ని షేర్‌ చేయాలనుకుంటే అది నిజమో కాదో.www.factly.com, www.boomlive.in వంటి సైట్స్ లలో చెక్‌ చేయండి.

ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు వీపీఎన్‌ ఉపయోగించండి.లేకపోతే టీఓఆర్‌, డక్‌డక్‌ గోగా వంటి బ్రౌజర్లను మాత్రమే ఉపయోగించండి.

ఒకవేళ మీరు సైబర్‌ నేరగాళ్ల బారినపడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేసి దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube