Pakistan Team India : టీమిండియా ఓటమితో పాకిస్థాన్‌ ఇంటిముఖం.. ట్రోల్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం నాడు భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలయ్యింది.

 Pakistan Is Facing Home With India's Defeat Netizens Are Getting Angry With Trol-TeluguStop.com

పాకిస్థాన్, జింబాబ్వే జట్లపై వరుసగా గెలుస్తూ వచ్చిన టీమిండియా ఈ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది.కాగా టీమిండియా ఓటమితో పాకిస్థాన్ టీమ్‌కి బాగా నష్టం వాటిల్లింది.

ఎందుకంటే టీమిండియా గెలిస్తేనే పాక్ సెమీ ఫైనల్స్‌కి వెళ్ళేది.కానీ మన భారత జట్టు విజయం సాధించలేదు.

దాంతో పాక్‌కు సెమీస్‌కు వెళ్లే ఛాన్సెస్ దాదాపు శూన్యం అయ్యాయి.

ఒకవేళ దక్షిణ ఆఫ్రికా ఓడిపోయినట్లయితే దాని స్థానంలో పాక్ సెమీస్ బర్త్ చేజిక్కించుకునేది.

అయితే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవడంతో ఆ జట్టు సెమీఫైనల్ లో చోటు దక్కించుకుని పాకిస్తాన్ కి దారులు మూసేసింది.నిజానికి పాక్‌ టీమ్ నెదర్లాండ్స్‌పై కూడా అతి కష్టం మీద గెలిచింది.

అంటే ఈ దేశ జట్టు ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు.అందువల్ల ఇది సెమీఫైనల్స్ కి వెళ్లినా అక్కడ గెలిచి, ఫైనల్స్ కి వెళ్లడం దాదాపు అసాధ్యమని నిపుణులు అంటున్నారు.

పాక్ అభిమానులు మాత్రం ఎన్నడూ లేనివిధంగా టీమిండియా గెలవాలని బాగా ప్రార్థనలు చేశారు.కానీ వారి ప్రార్థనలు ఫలించలేదు.

కొద్ది రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 91 పరగులు చేయగా ఆ టార్గెట్ చేరుకోవడానికి పార్ట్ టైమ్‌ కింద మీద పడిపోయింది.ఇలాంటి టీం ఫైనాన్స్‌కి వెళ్తుందా, అసలు సెమిస్‌లో విజయం సాధిస్తుందా? అని చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.మరోవైపు పాక్‌ జట్టును ట్విటర్‌లో చాలామంది ట్రోల్ చేస్తున్నారు.”బైబై పాకిస్తాన్‌” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫన్నీ మీమ్స్‌ కూడా సోషల్ మీడియాలో వదులుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube