వామ్మో! ప్రాణమున్న రాళ్లను ఎప్పుడైనా చూశారా?

భూమి ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో కప్పబడి ఉన్న విషయం తెలిసిందే.భూమి కంటే సముద్రమే ఎక్కువ శాతాన్ని కలిగి ఉంది.

 Have You Ever Seen Living Stones Details, Living Stones, South America, Peru, Ch-TeluguStop.com

అయితే సముద్రం అనేక మిస్టరీలను తన కడుపులో దాచుకుని ఉంది.కొత్త విషయాలను, సముద్ర జీవులను కనుగొనేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.

అయితే మనకు తెలియని కొత్త విషయాలు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనవుతాం.మిస్టరీ విషయాలు చేసినప్పుడు ఒక్కింత ఆశ్చర్యానికి గురవుతాం.

దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

రాళ్లకు ప్రాణముంటాయనే విషయాన్ని ఎవరూ నమ్మరు.

కానీ అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు నమోదవుతుంటాయి.కొన్ని ఊర్లల్లో చెట్లను నరికినప్పుడు చెట్టు నుంచి రక్తం కారుతుంటుంది.

ఇలాంటి ఘటనలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతారు.చెట్ల నుంచి రక్తం ఎలా కారుతుందో.

రాళ్ల నుంచి రక్తం కారితే.వినడానికే షాకింగ్‌గా అనిపిస్తోంది కదా.అలాంటి ఓ ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.రాళ్లకు ప్రాణం ఉండదు.

అందులో ఎలాంటి మాంసపు ముద్దలు ఉండవు.కానీ దక్షిణ అమెరికా ప్రాంతంలో ఓ వింతైన రాయి ఉంది.

ఈ రాయిని పగలగొట్టినప్పుడు అందులోనుంచి రక్తం కారుతుంది.

ఇలాంటి ఓ రాయి ఉందని సందేహమే వద్దు.

ఈ రాళ్లను నేలకేసి కొట్టినా.పగలగొట్టినా.

అందులోనుంచి రక్తం కారుతుంది.అలాగే అందులోనుంచి మాంసం లాంటి పదార్థం కూడా ఉంటుంది.

అయితే ఇందులో ఓ గమ్మత్తు విషయం కూడా దాగి ఉంది.

ఈ రాయి నుంచి బయటికి వచ్చిన మాంసాన్ని కొన్ని దేశాల ప్రజలు ఇష్టంగా తింటారు. ‘పియురా చిలియెన్సిస్’ అని పిలువబడే ఈ వింతైన రాళ్లు దక్షిణ అమెరికా దేశాలైన పెరూ, చిలీ సముద్ర అడుగు భాగాల్లో దొరుకుతాయి.ఈ వింతైన రాళ్లు పెద్ద పెద్ద రాళ్లకు అతుక్కొని పెరుగుతాయి.

వీటిని ‘గ్రే స్టోన్స్, పీరియడ్ రాక్స్’ అని కూడా పిలుస్తుంటారు.

చూడటానికి అచ్చం రాళ్లల్లా కనిపించే ఇవి సముద్ర జీవులు.

వీటి పై భాగం ఎంత గట్టిగా ఉంటుందో.లోపలి భాగం అంత మెత్తగా ఉంటుంది.

ఇతర జీవుల్లాగే శ్వాస, ఆహారం కూడా తీసుకుంటాయి.పిల్లలను కూడా జన్మనిస్తాయి.

ప్రపంచంలోని ప్రముఖ రెస్టారెంట్లలో ఈ రాయితో ఆహారాన్ని తయారు చేస్తారు.కొన్ని చోట్లలో పచ్చిగా కూడా తింటారు.

చాలా అరుదుగా దొరకడంతో వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube