ఇనుముతో తయారు చేసే దాగలి పట్టెడ లేదా దిమ్మెపై మెటల్ పెట్టి వాటిని సుత్తితో కొడుతుంటారు కమ్మరవారు.ఈ ఇనుము దిమ్మలను మీరు ఎన్నో సార్లు చూసే ఉంటారు.
ఇవి చాలా బరువు ఉంటాయి.వీటిని సముద్రంలో వేసినా సెకన్లలోనే అడుగు భాగానికి చేరుకుంటాయి.
అంత బరువు ఉంటాయి ఇవి.అయితే తాజాగా చాలా బరువు ఉన్న ఒక దిమ్మె ఒక ద్రవంలో వేసిన మునగ లేదు.అది తేలుతూనే ఉంది.ఇంతకీ ఆ ద్రవం ఏంటంటే మెర్క్యూరీ.తెలుగులో దీనిని పాదరసం అని పిలుస్తారు.మెర్క్యురీ ఒక రసాయన మూలకం.
ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఏకైక సాధారణ లోహం.దీనిని సాధారణంగా క్విక్‌సిల్వర్ అని పిలుస్తారు.
లిక్విడ్ రూపంలో ఉండే మెర్క్యూరీ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందట అందుకే ఇందులో ఎంత బరువైన లోహాలను లేదా రాళ్ళను వేసినా కూడా అది తేలుతూనే ఉంటుంది.నిపుణుల ప్రకారం, పాదరసానికి ఇనుము కంటే దాదాపు రెట్టింపు సాంద్రతను కలిగి ఉంటుంది.
వాస్తవానికి, సాంద్రత నిష్పత్తుల కారణంగా, నీటిలో కలప కంటే మెరుగ్గా ఇనుము పాదరసంలో తేలుతుంది.

ఈ విషయాన్ని నిరూపించేందుకు తాజాగా ఒకరు ప్రయోగం చేశారు దానికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్ద ఇనుప దిమ్మెను లిక్విడ్ మెర్క్యూరీలో వేయగా అది మునగకుండా తేలుతూ కనిపించింది.ఒకరు ఈ ఇనుము వస్తువును గట్టిగా పాదరసంలో ముంచాలని చూశారు కానీ అది సాధ్యం కాలేదు.
ఈ వీడియోకి ఇప్పటికే 83 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.ఈ అద్భుతమైన వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







