నేడు మునుగోడులో కేసీఆర్ సభ ! ఏం మాట్లాడుతారో ? 

మునుగోడు ఉప ఎన్నికల ప్రచార తంతు ముగియనుంది.దీంతో అన్ని పార్టీలు ముందుగానే అలెర్ట్ అవుతున్నాయి.

 Telangana Cm Kcr To Address Public Meeting In Munugode,kcr, Telangana, Congress,-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికలపై ఎక్కువ టెన్షన్ పడుతోంది.ఈ నేపథ్యంలోనే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో గెలిచేందుకు , ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఈ రోజు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.

ఈ సభలోనే ఆయన అనేక కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తుంది.ముఖ్యంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ లను టార్గెట్ చేసుకుని కెసిఆర్ ప్రసంగం ఉండబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ప్రతి పల్లె , ప్రతి గడపకు తిరుగుతూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలోని చుండూరు మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టేందుకు ముందుగానే ఏర్పాట్లు చేశారు.

గ్రామాలు, మండలాల వారిగా నియమితులైన ఇన్చార్జీలు ఈ జన సమీకరణ పైనే పూర్తిగా దృష్టి సారించారు.అన్ని ప్రధాని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కెసిఆర్ కాంగ్రెస్, బిజెపిల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ ను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తామో కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.దీంతో పాటు ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను , రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలు గురించి కేసీఆర్ వివరించే అవకాశం ఉంది.

Telugu Congress, Kcr Munugodu, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Trs-Polit

ఇక ఈ నియోజకవర్గంలోని పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా కేసీఆర్ సూచనలు చేయబోతున్నారు.ముఖ్యంగా బిజెపి అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే పార్టీ మారారనే విషయాన్ని కేసిఆర్ హైలెట్ చేయబోతున్నారట.ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ జరగాల్సి ఉన్నా.అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.

దీంతో పూర్తిగా ప్రచారంపైనే బిజెపి దృష్టి పెట్టింది.ఇక కాంగ్రెస్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతూ ఉండడంతో,  ఆ ప్రభావం మునుగోడు ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని ఆ పార్టీ ధీమాతో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube