క్రమశిక్షణకు మారుపేరుగా తెలుగుదేశం పార్టీ పేరు ఒక దశలో మారుమోగుతూ ఉండేది.అయితే ఆ తరువాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పై మెల్లిమెల్లిగా పార్టీ నాయకుల దిక్కార స్వరాలు బయటకు వచ్చేవి.
బాబు ఏం చేసినా ఆచితూచి చేస్తారనే విషయం పార్టీ నాయకులకు బాగా తెలిసినా.కొంతమంది కీలక నాయకులు బాబు నిర్ణయం పై పరోక్షంగా చురకలు వేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు ఎన్నో ఆ పార్టీలో నడిచాయి.2019 ఎన్నికల్లో టిడిపి ఘోరం గా ఓటమి చెందిన తర్వాత, ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించినా.చంద్రబాబు మాత్రం ఎక్కడా రాజీ పడ లేదు.
పార్టీని మెల్లిగా గాడిని పెట్టే విషయంలో ఆయన అనుకున్న మేరకు సక్సెస్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజల్లో సానుకూలత పెరుగుతున్న విషయాన్ని గుర్తించి ఆ పథకాలు, జగన్ నిర్ణయాలలోని లోపాలను హైలెట్ చేస్తూ పార్టీ శ్రేణులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేయించడంలో బాబు సక్సెస్ అయ్యారు.
అదే సమయంలో పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్ది , కొన్ని కొన్నిచోట్ల 2024 ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తూ.మిగతా నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్చార్జీల నియామకం చేపట్టి వారంతా యాక్టివ్ అయ్యేలా పార్టీ శ్రేణులను ఏకతాటి పైకి తీసుకువచ్చి, పనిచేసే విధంగా చేయడంలో బాబు సక్సెస్ అయ్యారు .ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకున్న అమరావతి విషయంలో టిడిపి లో ప్రాంతాలవారీగా నాయకులు మొదట్లో స్పందించేవారు .

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాగా, కోస్తా ,రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి నాయకులు ప్రాంతాల వారీగా జగన్ నిర్ణయానికి మద్దతు పరోక్షంగా పలికేవారు.అయితే ఈ వ్యవహారం బాబుకు మాత్రం ఆగ్రహాన్ని కలిగిస్తూ వచ్చింది.అందుకే మెల్ల మెల్లగా అమరావతికి మద్దతుగా సొంత పార్టీ నాయకులు ఉండేలా … ఎవరు ఎక్కడ దిక్కర స్వరం వినిపించకుండా పార్టీని గాడిలో పెట్టడం లో బాబు సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి ప్రజాప్రతినిధులు ఇతర కీలక నాయకులు అమరావతి రాజధానిగా ఉండాలంటూ బహిరంగంగా డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయానికి జై కొడుతూ వస్తున్నారు.ఈ విధంగా చూసుకుంటే పార్టీని ఒక గాడిలో పెట్టే విషయంలో చంద్రబాబు అనుకున్న మేరకు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.







