తెలంగాణలో అవినీతి, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ గా సీఎం కేసీఆర్ కుటుంబం మారిందని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆరోపించారు.కేసీఆర్ ఎలాంటి మాయలు చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు.
ఫిరాయింపుదారులంతా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేశారు.
ఫైలట్ రోహిత్ రెడ్డిపై కర్ణాటకలో డ్రగ్ కేసు ఉందని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.







