4 ఫ్లాపులు అయినా చేతిలో 10 సినిమాలు.. 62 ఏళ్ళ వయసులో అద్భుతం

సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం.బాషా ఏదైనా సరే ఒక్కసారి తమ హృదయాలకు దగ్గర గా ఉన్న హీరో సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా గుండెల్లో పెట్టుకుంటారు.

 Mohan Lal Back To Back Movies ,mohan Lal ,akshay Kumar,drsyam 2 ,marakkar,brodad-TeluguStop.com

ఆలా హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందు ఉంటాడు.ఆ తర్వాత ఇప్పుడు ఈ రికార్డు మలయాళ హీరో మోహన్ లాల్ కి దక్కింది.

ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో పది సినిమాలు ఉండటం విశేషం.ఇప్పటికే మోహన్ లాల్ వరసగా నాలుగు ఫ్లాపులు ఉన్నాయ్.

దృశ్యం 2 సినిమా తర్వాత ఆయన నటించిన మరక్కర్ పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఆ తర్వాత బ్రోడాడి కూడా ఫ్లాప్ అయ్యింది.

ఆరాట్టు, 12 మ్యాన్ సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి.

Telugu Akshay Kumar, Arattu, Brodaddy, Drsyam, Malayalam, Marakkar, Mohan Lal-Te

అయినా కూడా ఎంతో విధేయుడిగా పేరు సంపాదించుకున్న మోహన్ లాల్ కి సినిమా అవకాశాలకు మాత్రం కొదవేమి లేదు.అలోన్, ఒలవుమ్ తీరవుమ్, రామ్ పార్ట్ 1, రామ్ పార్ట్ 2, బర్రోజ్, వివేక్ తో ఒక సినిమా, లూసిఫర్ సీక్వెన్స్ , లిజోజోస్ తో ఒక సినిమా ఇలా మొత్తం పది సినిమాలు అతడి చేతిలో ఉన్నాయ్.ప్రస్తుతం 62 ఏళ్ళ వయసులో యువ హీరోలకు దీటుగా ఇలా ఏక కాలంలో పది సినిమాలతో మలయాళ పరిశ్రమకు షాకిస్తున్నాడు.

కొత్త హీరోలు వస్తుంటే వయసు పెరుగుతున్న హీరోలకు డిమాండ్ తగ్గుతుంది అనుకుంటారు కానీ ఎంతో వినయం, క్రమ శిక్షణ కలిగిన సీనియర్ హీరోలపై మలయాళ పరిశ్రమకు ఎంత ప్రేమ ఉందో మోహన్ లాల్ వంటి సీనియర్ హీరో కు లభిస్తున్న సినిమా అవకాశాలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది.

Telugu Akshay Kumar, Arattu, Brodaddy, Drsyam, Malayalam, Marakkar, Mohan Lal-Te

లేని పోనీ బిల్డప్పులు, అవసరం లేని ఇమేజ్ లకు పోకుండా కథను మాత్రమే నమ్ముకొని సినిమాలు తీయడం లో మోహన్ లాల్ కి మంచి పేరుంది.బాషా ఏదైనా సరే కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా సరే మోహన్ లాల్ నటించడానికి సిద్ధంగా ఉంటున్నాడు.ప్రస్తుతం తెలుగు, హిందీ , కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు మోహన్ లాల్.

కేవలం మోహన్ లాల్ మాత్రమే కాదు చాల మంది సీనియర్ హీరోలు కూడా చేతి నిండా ప్రాజెక్ట్స్ తో తమలో సత్త ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube