విజువల్ ఎఫెక్ట్స్ వల్ల డిజాస్టర్స్ గా మారుతున్న సినిమాలు ఇవే !

సినిమా చూసే విధానం, తీసే విధానం అన్ని మారిపోయాయి.సినిమా స్టాండర్డ్స్ పెంచుతూ అనేక ఎఫెక్ట్స్ జోడిస్తూ, హంగులు, ఆర్భాటాలతో తీస్తున్నప్పటికీ ప్రేక్షకులు మెచ్చుతారు అనే నమ్మకం లేదు.

 Movies Failed Due To Poor Vfx ,brahmastra, Acharya , Radhyashyam, Chiran Jeevi,-TeluguStop.com

ఒక్కో సారి మితిమీరిన ఎఫెక్ట్స్ ని జనాలు తిప్పికొట్టచ్చు.అయితే అలాంటి పరిణామాలు ప్రస్తుతం కనిపిస్తూనే ఉన్నాయ్.

ఇటీవల కాలంలో వస్తున్న భారీ విజవల్ ఎఫెక్ట్ సినిమాలు దారుణంగా పరాభవం పాలవుతున్నాయి.అందుకు గల ముఖ్య కారణం చెప్పవలసిన విషయాన్ని పూర్ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సరిగ్గా చెప్పలేకపోవడమే అని తెలుస్తుంది.

ఏదైనా సీన్ లో ఎమోషన్ పండాలంటే ప్రేక్షకుడు హృదయానికి హత్తుకునేలా ఆ విషయాన్నీ మంచి ఎఫెక్ట్స్ తో చూపించడం వల్ల సినిమాకు మంచి విజయం దక్కుతుంది.బాహుబలి, RRR, అవతార్, ఎవెంజర్స్ వంటి సినిమాల్లో ఖరీదైన విజయాల ఎఫెక్ట్స్ సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి.

కానీ ఆ తర్వాత వస్తున్న కొన్ని సినిమాలు ఆ క్వాలిటీ ని అందుకోవడంలో విఫలం అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.ఇలా ఫెయిల్ అవుతున్న సినిమాలను చూస్తున్న సినిమా మేకర్స్ ఆ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Telugu Acharya, Brahmastra, Chiran Jeevi, Pooja Hegdhe, Prabhas, Radhyashyam, Ra

ఇటీవల కాలంలో వచ్చిన ఆచార్య సినిమా ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పచు.ఈ సినిమాలోని కొన్ని పూర్ VFX ఎఫెక్ట్స్ వల్ల సినిమా దారుణంగా ట్రోల్ అయ్యింది.భారీ ఎఫెక్ట్స్ సినిమాలను చూసిన ప్రేక్షకుడికి ఇలాంటి పూర్ క్వాలిటీ నచ్చడం లేదు.ఇక ఆచార్య కోవలోకే బ్రహ్మాస్త్ర, రాధే శ్యామ్ వంటి కొన్ని సినిమాలు వచ్చి చేరాయి.

ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ సైతం దారుణంగా ట్రోల్ కి గురి కావడం మనం చూస్తూనే ఉన్నాం.ఇక రామాయణం సినిమాలోని రామ సేతు ని కథాంశం గా తీసుకొని తెరకెక్కిన రామ సేతు సినిమా సైతం విమర్శల పాలవుతుంది.

మరి ఇలా పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఇంకెన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయో తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube