టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది.నిందితుల అరెస్ట్ ను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు.మేజిస్ట్రేట్ తప్పుడు ప్రొసీజర్ ను అనుసరించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలీసుల హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది.