కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ప్రతీ ఇండస్ట్రీకి పరిచయమే.ఈయన తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల మనస్సులో సూపర్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.
ఇక ఈయనకు ప్రేక్షకులు మాత్రమే కాదు సెలెబ్రిటీలు కూడా ఫ్యాన్స్ గా ఉన్నారు.మరి ఆ లిష్టులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఉంది.
ప్రెజెంట్ తన అభిమాన హీరోతోనే రష్మిక సినిమా చేస్తుంది అనే సంతోషంగా మునిగి తేలుతుంది.టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.
వారసుడు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక మందన్న నే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఆఫర్ వచ్చినప్పటి నుండి ఈమె ఎప్పుడు చెబుతూనే ఉంది తాను విజయ్ దళపతికి ఎంత పెద్ద ఫ్యానో.
ఈ సినిమా ముహూర్తం పెట్టిన నాటి నుండి సినిమా షూట్ లో ప్రతీ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ విజయ్ తో వీలు కుదిరినప్పుడల్లా సెల్ఫీలు తీసుకుంటుంది.వాటిని ఆమె ఫ్యాన్స్ తో కూడా పంచుకోవడంతో ఇవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరి తాజాగా మరోసారి అలాంటి సెల్ఫీ ఒకటి షేర్ చేయగా ఇది కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సెల్ఫీలో విజయ్, రష్మిక తో పాటు ఈసారి సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఉంది.ఇలా తన ఫ్యాన్ గాళ్ ఎగ్జైట్మెంట్ ను చూపిస్తూనే ఉంది.ఇదిలా ఉండగా.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.