ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోకపోయినా, దాదాపు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినట్లే.దాదాపు ఈ విషయంలో జనసేన , టిడిపి నాయకులతో పాటు, జనాలు ఒక క్లారిటీకి వచ్చేసారు.
మొదటి నుంచి పవన్ చంద్రబాబు మనిషి అన్నట్లుగా వైసీపీ విమర్శలు చేస్తూనే వచ్చింది.ఈ విమర్శలను తిప్పుకొట్టేందుకు పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అంటూ గతంలో ప్రకటించినా… వైసిపి మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలంటే కచ్చితంగా టిడిపి జనసేన కలిసి పోటీ చేయాలని, లేకపోతే అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లు చీలి తమ రెండు పార్టీలకు నష్టం చేకూరుస్తుందని, అంతిమంగా వైసీపీకి లాభం చేకూరుతుందనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు.
ఇక ఎన్నికల సమయం నాటికి టిడిపి, జనసేన పొత్తు అధికారికంగా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకునే విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టిడిపి ,జనసేన కలిసి పోటీ చేసినా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు తానని తప్ప ఎవరిని అంగీకరించరని, అలా అయితే పవన్ ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు అని, అందుకే ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామనే కండిషన్ పెట్టాలంటూ ఒత్తిడి పవన్ పై పెరుగుతోంది.ఇక బిజెపి సైతం ఇదే అభిప్రాయంతో ఉంది.
అసలు టిడిపి , జనసేన కలిసి వెళ్లేందుకు ఆ పార్టీ ఏమాత్రం ఇష్టపడడం లేదు.గతంలో బీజేపీ, జనసేన సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత వ్యవహరించిన తీరుని ఎవరూ మర్చిపోవడం లేదు.
అందుకే వీలైనంత దూరంగా పవన్ ను టిడిపికి దూరంగా ఉండాలంటూ బిజెపి ఒత్తిడి చేస్తోంది.

2024 ఎన్నికల్లో జనసేన టిడిపిలో మాత్రమే కలిసి పోటీ చేస్తాయంటూ ఇప్పటికే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తో పాటు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.అయినా టిడిపి విషయంలో పవన్ సానుకూలంగానే ఉండడంతో, కొంతమంది బిజెపి ఢిల్లీ పెద్దలు పవన్ కు అనేక సూచనలు చేసినట్లు సమాచారం.ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే టిడిపితో పొత్తుకు ఒప్పుకోవాలని పవన్ కు సూచించినట్లు విశ్వసనేయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
టిడిపి నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాత మాత్రమే పొత్తు విషయంలో ఆలోచించాలని పవన్ కు సూచించారట.ఇక జనసైనికులు సైతం పవన్ పై ఇదే విషయంలో ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.







