ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో చెప్పడానికి !

ఎన్టీఆర్ లాంటి హీరో గురించి చెప్పడానికి ఎన్ని మరలను మూటలుగా చేసిన, ఎన్ని పాదాలను పద్యాలుగా మలిచిన తక్కువే.అప్పటికే పదేళ్ల పాటు అనేక సినిమాల్లో, ఎన్నో పాత్రల్లో జీవించి నటించాడు.

 Ntr Movie Of Kalais Unte Kaladu Sukham , Kalasi Vunte Kaladu Sukham, Ntr , Chara-TeluguStop.com

అయినా కూడా దర్శకుడు తాపీ చాణక్య చెప్పిన కథను ఒప్పుకున్నాడు.ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ? తానొక స్టార్ హీరో.ఎంతో ఇమేజ్ ఉంది.అయినా కూడా ఈ సినిమాలో వికలాంగుడిగా నటించాడు.నేను ఏంటి .ఈ సినిమాలో వికలాంగుడిగా నటించడం ఏంటి అని ఒక్క మాట అనుకోని ఉంటె ఈ రోజు ఒక గొప్ప క్లాసిక్ సినిమా ఉండేది కాదు.ఆ సినిమా పేరు కలిసి ఉంటె కలదు సుఖం.

సినిమాలో భారీ తారాగణం ఉంది.

పైగా మహానటి సావిత్రి సినిమా మొత్తం తన నటనతో డామినేట్ చేసింది.అయినా కూడా అవిటి పాత్రా లో నటించడం తనకేమి తక్కువ అని అయన భావించకుండా ఆ పాత్రకు ప్రాణం పోసి ఎంతో అద్భుతంగా నటించారు ఎన్టీఆర్.

న్టీఆర్ కంటే ముందు ఎంతో మంది గొప్ప నటులు, హీరోలు ఉండచ్చు .ఎన్టీఆర్ తర్వాత కూడా మరెంతో మంది స్టార్ హీరోలు వచ్చారు.అయినా కూడా ఆయనకు ఉన్న చరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు అవన్నీ దిగదుడుపే.ఇక ఆయన్ను తెలుగు సినిమా అభిమానులు ఒక దేవుడిలా కొలుస్తూ ఉంటారు.అంతటి క్రేజ్ ఊరికే రాదు కదా.అయన నటించిన ఇలాంటి ఎన్నో సినిమాలు చూస్తే ఆ క్రేజ్ ఎందుకు వచ్చిందో అర్ధం అవుతుంది.

Telugu Character, Cvr Prasad, Kalasivunte, Ramakrishna, Savitri, Tapi Chanakya,

ఒక సినిమా కి ఎంత బాగా డబ్బు వచ్చిన, అవార్డు వచ్చిన కూడా మనకు ఆత్మ సంతృప్తి కలగదు.కానీ కలసి ఉంటె కలదు సుఖం వంటి సినిమాలో నటిస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం అనేది ఎన్టీఆర్ గారి వర్షన్.ఉమ్మడి కుటుంబం అంటే ఆయనకు ఉన్న ఇష్టం అలాంటిది.ఉమ్మడి కుటుంబలో ఉండే అభిమానాలు.ప్రేమలు, కోపాలు, అలకలు, అహంకారం అన్ని కలిపి ఈ సినిమాలో చూపించారు దర్శకుడు తాపీ చాణక్య.ఈ సినిమాకు రామ కృష్ణ ప్రసాద్, సి వి ఆర్ ప్రసాద్ నిర్త్మతలుగా వ్యవహరించగా, 1961 లో విడుదల అయినా ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

ఇక నేటి రోజుల్లో ఇలాంటి ఒక సినిమా తీస్తే ఆదరించే ప్రేక్షకులు సైతం లేకపోవడం నిజంగా బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube