టాలీవుడ్ ప్రేక్షకులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మారిపోయింది.ఈ సినిమా విడుదల అయిన తర్వాత విడుదల కాక ముందు ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా మేనియానే కనిపించింది.
ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ అయితే ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటుంది.అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
పుష్ప సినిమాలోని పను పాటలకు ఇతర దేశం వాళ్లు కూడా స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అల్లు అర్జున్ అభిమాని అన్న విషయం తెలిసిందే.
డేవిడ్ వార్నర్ పుష్ప సినిమా స్టైల్ లుక్ షేర్ చేసి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.ఇది ఇలా ఉంటే తాజాగా మరొక క్రికెటర్ అల్లు అర్జున్ పై తనకున్న అభిమానాన్ని తెలిపారు.
తాజాగా టీమ్ ఇండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఒక అభిమాని మీ ఫేవరెట్ తమిళ హీరో ఎవరు అని ప్రశ్నించగా.ఆ విషయంపై ధావల్ కులకర్ణి స్పందిస్తూ అల్లు అర్జున్ అంటూ సమాధానం ఇచ్చాడు.దాంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని, కోలీవుడ్ హీరో అని చెప్పడంతో అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ సమాధానం పై స్పందించిన ఒక అభిమాని అల్లు అర్జున్ తమిళ హీరో కాదు కదా అని ప్రశ్నించగా.అదేమో నాకు తెలియదు కానీ నా ఫేవరెట్ హీరో మాత్రం అల్లు అర్జున్ అని కులకర్ణి తెలిపారు.








