దీపావళి పండుగ మనసటి రోజు సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం వచ్చింది.కానీ ఇది జరిగిన 15 రోజుల తర్వాత అంటే సరిగ్గా నవంబర్ 8వ తేదీన, ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది.
కార్తీకమాసం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం అయ్యే అవకాశం ఉంది.
ఇది భారతదేశంలో కూడా సంపూర్ణంగా కనిపిస్తుంది.అయితే భారత దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం5.30 ప్రారంభమై 6.19 నిమిషాల వరకు ఉంటుంది.అంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ గ్రహణం మన దేశంతో పాటు ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం లలో కనిపిస్తుంది.అయితే జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించడం ఆ శుభమని చెబుతున్నారు.
అంటే 15 రోజుల వ్యవధి లో వచ్చే రెండు గ్రహణాలు ప్రపంచం పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే వాతావరణంలో ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది.
దేశం అభివృద్ధి తగ్గుతుంది.వ్యాపారస్తులలో ఆందోళన పెరుగుతుందని కూడా చెబుతున్నారు ఈ గ్రహణాల వల్ల జీవితంలో చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని కూడా చాలామంది ప్రజలు నమ్ముతున్నారు.

అందువల్ల ఆ గ్రహణం యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి అనేక నివారణలు ఉన్నాయి.గ్రహణం సమయంలో ఎటువంటి పూజలు నిర్వహించకూడదని ఆలయాలను మూసివేసి ఉంచుతారు.అలాగే గ్రహణానికి ముందు తయారుచేసిన ఆహారాన్ని కూడా తినకూడదు.ముందు గా స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లుకోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.







