అసోంలో నిషేధిత డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి.అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.10 కోట్ల విలువైన హెరాయిన్ ను సీజ్ చేశారు.అనంతరం డ్రగ్స్ తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







