ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బుధవారం మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు.బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఖర్గే పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.
పార్టీలో అంతర్గత మార్పులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి.
అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు.దీంతో అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి రోజే తన మార్క్ చూపించేలా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టీరింగ్ కమిటీలో మొత్తంగా 47 మంది సభ్యులు ఉన్నారు.వీరిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సహా ప్రముఖులు ఉన్నారు.
ఈ కమిటీ పార్టీ అత్యన్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ (సీడబ్ల్యూసీ) స్థానంలో పని చేయనుంది.బుధవారం ఉదయమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులు రాజీనామా చేశారు.
ఈ రాజీనామా లెటర్‌ను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు.అలాగే ప్లీనరీ సెషన్ నిర్వహించే వరకు స్టీరింగ్ కమిటీని కొనసాగించనున్నారు.
అలాగే తదుపరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్‌లో వర్కింగ్ కమిటీ కొత్త సభ్యులను ఎంపిక చేయనున్నారు.
స్టీరింగ్ కమిటీలో ఉన్న సభ్యులు వీరే.మల్లికార్జున ఖర్గే (అధ్యక్షుడు), సోనియా గాంధీ (మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు), మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకే.ఆంథోని, అభిషేక్ మను సింఘ్వీ, అజయ్ మకేన్, అంబికా సోని, ఆనంద్ శర్మ, అవినాష్ పాండే, గైఖంగం, హరీష్ రౌత్, జైరాం రమేశ్, జితేంద్ర సింగ్, సెల్జా, వేణుగోపాల్, లాల్తన్‌వాలా, ముకుల్ వాస్‌నిక్, ఓమన్ చండే, ప్రియాంకా గాంధీ వాద్రే, చిదంబరం, రణదీప్ ఎస్ సూర్జేవాలా, రఘుబీర్ మీనా, తారిఖ్ అన్వర్, చెల్లా కుమార్, అజయ్ కుమార్, అదిర్ రంజన్ చౌదరి, భక్త చరణ్ దాస్, దేవేంద్ర యాదవ్, దిగ్విజయ్ సింగ్, దినేష్ రావు, హరీష్ చౌదరి తదితరులు ఉన్నారు.