భారత దేశ ఎన్నికల చరిత్ర లోనే కాస్ట్లి ఉప ఎన్నికలు గా గుర్తించబడిన నల్గొండ జిల్లా మునుగోడు శాసన సభ కి నవంబర్ 3 న ఎన్నిక జరుగనుంది .అదే నెల ఆరున ఫలితం రానుంది.
ఇంకా ప్రచారానికి ఆరు రోజుల గడువు వుంది.ఈ ఎన్నికలు రాస్ట్ర వ్యాప్తంగా ప్రజలలో హీటును పెంచుతూ వున్నాయి.
ఏ నోట విన్నా మునుగోడు గెలుపెవరిధనే చర్చ జరుగుతూ వుంది.ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం హోరా హోరీగా సాగుతూ వుంది.
ప్రతీ రోజు టీఆర్ఎస్ పార్టీ అన్ని కులాల ఆత్మీయ సమ్మేళనం లతో ఆయా వర్గాలకి వరాలు కురిపిస్తూ వుంది. కేటిఆర్ అంతా తానేగా అన్ని మండలాలలో రోడ్ షోలు నిర్వహిస్తూ భాజాపా తీరును ఎండగడుతూ అందరూ మంత్రులను, శాసన సభ్యులను సమన్వయం చేస్తూ దూకుడు పెంచుతూ వున్నారు.
పదహారు మంత్రులు ఈ నియోజక వర్గంలో మకాం వేసి కలియ తిరుగుతూ వున్నారు.తమకు కేటాయించిన మండలాలలో సుడిగాలి పర్యటన చేస్తూ వున్నాయి.
భాజాపా పార్టీ అభ్యర్థి , సుదీర్ఘ రాజకీయ అనుభవం గల కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అన్ని మండలాల్లో నీ గ్రామాలలో ప్రచారం చేస్తూ తనను గెలిపించాలని కోరుతూ వున్నారు.తాజాగా భువన గిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గులాబీ కండువా వదిలి కాషాయ రంగు కండువా కప్పు కోవడం తో టి.ఆర్.స్ శ్రేణులు కంగు తిన్నారు.భాజాపా తరుపున రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాసన సభ్యులు ఇక్కడే మకాం వేశారు.హుజూరబాద్ శాసన సభ్యులు ఈటెల రాజేందర్,దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు లు కోమటి రెడ్డి నీ గెలిపించాలని ప్రచారం చేస్తూ వున్నారు.
వివేక్ వెంకట్ స్వామి, డి.కే.అరుణ, జితేందర్ రెడ్డి,విజయ శాంతి, రాణి రుద్రమ రెడ్డి,కీర్తి రెడ్డి లతో ఆయా గ్రామాల లో విస్తృతంగా పర్యటించి ఓట్లు అడుగుతూ వున్నారు.కేంద్రం లో మోడీ ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూవున్నారు.
గతంలో టీ.ఆర్.స్ పార్టీ నుండి పోటీ చేసీ ఓడి పోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నుండి ఈ సారి బరి లో వున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యలో బీజేపీ నుండి బి.ఆర్.యస్ కి చేరికలు జరుగుతూ వున్నాయి.
తాజాగా మాజీ శాసన మండలి సభ్యులు స్వామి గౌడ్, దాసొజ్ శ్రవణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే బిక్షమయ,పల్లె రవి కుమార్ గౌడ్,మాజీ రాజ్య సభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ లు టి.ఆర్.యస్ తీర్థం పుచ్చుకున్నారు.కాంగ్రెసు నుండి మాజీ మంత్రి సీనియర్ నేత దివంగత గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి ఆడ బిడ్డ అయిన తనను గెలిపించాలనీ నియోజక వర్గంలోఆమె సుడిగాలి పర్యటనచేస్తూ తనను గెలిపించాలని కోరుతూ వున్నారు.
పి.సి.సి చీఫ్ రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క,జగ్గా రెడ్డి,సీతక్క,మాణిక్యం తాకూర్,శ్రీధర్ బాబు,వీరయ్య లాంటి స్టార్ లీడర్లు నియోజక వర్గంలోని ఆయా గ్రామాలలో పర్యటిస్తూ వున్నారు.కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు తో కాంగ్రెస్ నేతలు ఖంగు తిన్నారు.
గోడల మీద ఆయా పార్టీల ప్రచారాలు,అడుగడుగునా ఆయా పార్టీల జెండాలు,గ్రామ నాయకత్వం ఫ్లెక్సీలు దారుల పొడవున దర్శనమిస్తున్నాయి.గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది.పోలీసుల తనిఖీలో రోజు లక్షలాది రూపాయల డబ్బు.ఆయా పార్టీల నాయకులు వాహనాలలో ఓటర్ల కి పంచడానికి తరలిస్తుండగా పట్టుకుంటూ కేసులు నమోదు చేస్తూ వున్నారు.
ప్రతీ ఓటరుకి కిలో బంగారం లేదా ఓటుకు నలభయి వేలు ఇస్తారని ప్రచారం జరుగుతూ వుంది.ఆయా పార్టీలు ప్రతీ రోజు చికెన్,మటన్ లతో పోటా పోటీగా దావతులు ఇస్తూ వున్నారు.
టీ,కాఫీ లకు కొదువే లేదు.ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
పార్టీలు ఒకరి కోకరు తిట్ల పురాణం తో ప్రచారం చేస్తున్నారు.పరుష పదజాలంతో దుమ్మెస్తి పోస్తూ వున్నారు.
ఒకవైపు దీపావళి పండగ నోములు వున్న వారికి ఇంటికి కిలో స్వీట్స్,టపాసులు కూడా పంపిణీ చేశారు.ఎక్కడ చూసినా మద్యం మత్తులో తూలుతూ వుండే దృశ్యాలే కనపడుతూ వున్నాయి.
చికెన్,మటన్,చేపలు,కూరగాయల ధరలు కొండెక్కి నాయి.
హైదరాబాద్ నగరం నుండి లారీల్లో మేకలు, గొర్రెలు,కోళ్లు మునుగోడు కి తరలిస్తూ వున్నారు.
మద్యం షాపులు ముందు మందు కోసం బారులు తీరుతున్నారు.ఎన్నికల అనంతరం ఎంత మంది ఓటరు మహాశయులు కాలం చేస్తారో తెలియడం లేదు.ప్రధాన పార్టీల అగ్రనేతలు కే.సి.ఆర్,అమిత్ షా లు ఈ నెల చివరన బహిరంగ సభలు నిర్వహించడానికి సిద్ధం అవుతూ వున్నారు.కోన్ని చోట్ల ఆయా నాయకుల ప్రసంగాలను అడ్డుకుంటూ వున్నారు.
గొడవలు జరుగుతున్నాయి.వ్యవసాయ పనులలో వున్న రైతులు అవి వదిలేసి,మరోవైపు ఆయా పార్టీల రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా కి చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు లోనే మకాం వేసి టీ.ఆర్.స్ క్యాడర్ వేరే పార్టీలకు వెళ్లకుండా ఆడుకట్ట వేస్తూ వున్నారు.వేరే పార్టీల నాయకులు టీ.ఆర్.యస్ పార్టీ లోకి వచ్చేలా ఆపరేషన్ ఆకర్ష్ నీ నిర్వహిస్తూ ఈ సారి మునుగోడు గడ్డ మీద ఎగిరేది గులాబీ రంగు జెండా అంటూ కార్యకర్తలలో జోష్ నింపుతూ వున్నారు.గతం లో హుజురాబాద్ నియోజక వర్గంలో విపరీతంగా మద్యం ,డబ్బు పంపిణీ జరిగిన విధంగానే ఈ సారి మునుగోడు లో కూడా జరుగుతోంది.అధికార పార్టీ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుని సర్వశక్తులూ ఒడ్డి గెలవాలని ప్రయత్నం చేస్తూ వుంది.
ప్రతీ యం.పి.టి.సి స్థానాలు వున్న ఆయా గ్రామాల లో అధికార పార్టీ శాసన సభ్యులు 84 మందిని ఇంచార్జులు గా నియమించి తక్షణం వారికి కేటాయించిన గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ వున్నారు.అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తన మాటల వాగ్ధాటితో బీజేపీ నేత, దేశ హోమ్ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ నెల 30 న మునుగోడు మళ్ళీ వస్తారనే ప్రచారం జరుగుతూ వుంది…అమిత్ షా పాల్గొనే బహిరంగ సభలో మరెంతో మంది వివిధ పార్టీల అగ్ర నేతలు పాల్గొంటారు.ఈటెల రాజేందర్ సతీమణి జమునా రెడ్డి స్వగ్రామం మునుగోడు సమీపం లోని గ్రామం కావడం వీరు ప్రచారము లో దూకుడు పెంచుతూ వున్నారు.కోమటి రెడ్డి సతీమణి కూడా మహిళా ఓటర్లు వున్న కాడికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ వున్నారు.టి.ఆర్.యస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి వెంట వున్న నాయకులు, ప్రజలను అధికార పార్టీ లో చేరేలా ప్రయత్నాలు చేస్తూ వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలుకుతూ వున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిత్యం మంత్రులతో, నల్గొండ జిల్లాకు చెందిన శాసన సభ్యుల తో ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు.

మునుగోడు నియోజకవర్గం ఎన్నికల మీద పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నారు.వామ పక్షాలు కూడా అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు.పి.సి.సి అధ్యక్షులు గా రేవంత్ రెడ్డి భాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగే రెండో ఉప ఎన్నికలు.మునుగోడు లో రాజ గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చండూరు లో కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతంతో ఫుల్ జోశ్ మీద వున్న కాంగ్రెసు పార్టీ కొత్త పి.సి.సి అధ్యక్షులు యెనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో శాసన సభ్యులు మల్లు బట్టి విక్రమార్క, సీతక్క,మాజీ పి.సి.సి అధ్యక్షులు,నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి జానా రెడ్డి, అద్దంకి దయాకర్,రాష్ట్ర ఇంఛార్జి మానికం టాకూర్,బోస్,దామోదర్ రాజనర్సింహ,మల్లు రవి తదితరులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు వున్నాయి.ఒక వైపు రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర తో బిజీ గా వున్న కాంగ్రెస్ పార్టీ మునోగొడు ఎన్నిక ను సీరియస్ గా తీసుకుని ముందుకు పోతూ ఉంది.
యే నలుగురు కలిసినా మునుగోడు ఎన్నికల మీద చర్చ జోరుగా సాగుతోంది.అందరి చూపు ,దృష్టి మునుగోడు మీదనే వుంది.దుబ్బాక, హుజురాబాద్ ఫలితం ఇక్కడ పునరావృతం అవుతూ వుందని బీజేపీ అంటూ వుంటే,టి.ఆర్.స్ మాత్రం నాగార్జున సాగర్ ఫలితం మునుగోడు లో వుంటూ వుందని చెప్పుతూ వున్నారు.చివరకి మునుగోడు లో గెలుపెవరిధి మీద బెట్టింగులు కూడ సాగుతూ వున్నాయని ఆరోపణలు వస్తూ వున్నాయి.

మునుగోడు నియోజక వర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణ చేయడానికి అధికారులు సమాయత్తం కావాలి.సోషల్ మీడియా లో మునుగోడు గెలుపు మీధ వివిధ యూ ట్యూబ్ చానెల్స్ లో ప్రజల అబిప్రాయాలు హొరెత్తిస్తూ వున్నాయి.మునుగోడు లో మొత్తానికి త్రిముఖ పోటీ ఉండనుంది.ఆయా పార్టీల నాయకులు ప్రతీ ఓటు కి ఎన్ని వేలు ఇస్తారో చూడాలి.ఒక వైపు టి.ఆర్.స్ బి.ఆర్.యస్ గా మారిన తర్వాత జరగనున్న ఉప ఎన్నికలు.మును గోడు నియోజక వర్గంలోనీ మండలాలలో గ్రామాలలో ఆయా పార్టీల నాయకులు తిష్ట వేయడానికి అద్దెలు విపరీతంగా పెరిగినాయి.
కళ్యాణ మండపం, ఫంక్షన్ హాళ్లు ఎప్పుడో బుక్ అయినాయి.మద్యం,మాసం అమ్మకాలు,చిరు వ్యాపారుల టీ కొట్టులు,టిఫిన్స్,మీల్స్ హోటళ్ల గిరాకీ జోరుగా సాగుతోంది.ఫ్లెక్సీ షాపు ల యజమానులు,ఆయా గ్రామాల కళాకారులకు పంట పండు తు వుంది.ఇంకా వారం రోజుల ప్రచార సమయం వుండటం తో ఎన్నడూ రాని వాహనాలు రయ్యి రయ్యి మంటూ మైకుల మోతతో ,డప్పు వాయిద్యాలు తో ఉర్రూత లూ గుతూ వున్నాయి.
దేశ చరిత్ర లోనే కాస్ట్లీ ఎన్నికలు గా ఈ ఎన్నికలు చరిత్రలో నిలువ నున్నాయి.







