బంగ్లాదేశ్లో సిత్రాంగ్ తుపాను బీభత్సం

సిత్రాంగ్’ తుపాను బంగ్లాదేశ్‌లో ప్రభావం చూపుతోంది.భోలా, నారియల్ జిల్లాల్లో విరుచుకుపడుతోంది.

 Cyclone Sitrang Is A Disaster In Bangladesh-TeluguStop.com

భోలా జిల్లాలోని దౌలత్‌ఖాన్, నారియల్ జిల్లాలోని చర్ఫాషాన్‌లలో చెట్లు కూలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.అలాగే, తుపాను కారణంగా పలువురు గాయపడినట్టు అధికారులు తెలిపారు.నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలను తుపాను తాకే అవకాశం ఉండడంతో 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.అలాగే, 6,925 తుపాను కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.తుపాను ప్రభావానికి గురైన చివరి వ్యక్తి కూడా ఆశ్రయం పొందేలా ఏర్పాటు చేశామన్నారు.సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి తీర ప్రాంతంలోని 15 జిల్లాల నుంచి 2,19,990 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు.తుపాను తీరం దాటినప్పుడు అలలు ఎగసిపడతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు, వారికి అత్యవసరాలైన ఆహారం, మందులు, నీళ్లు, టార్పాలిన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube