సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని మంచితనంతో, టాలెంట్ తో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకున్న డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే లైగర్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా నిర్మాతలలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు కావడంతో లైగర్ నష్టాల భారం పూరీ జగన్నాథ్ పై పడింది.
అయితే అతి మంచితనం వల్లే పూరీ జగన్నాథ్ మోసపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో కోట్ల రూపాయలు సంపాదించారు.అయితే ఒక వ్యక్తిని నమ్మడం వల్ల పూరీ జగన్నాథ్ చాలా సంవత్సరాల క్రితం ఆ డబ్బు విషయంలో మోసపోయారు.
అప్పటివరకు వరుసగా సక్సెస్ లను అందుకున్న పూరీ డబ్బు విషయంలో మోసపోయిన తర్వాతే తన టాలెంట్ కు తగ్గ సినిమాలు తీయలేకపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లైగర్ సినిమా బయ్యర్లకు సైతం డబ్బును వెనక్కి ఇచ్చేస్తానని పూరీ జగన్నాథ్ హామీ ఇవ్వడం జరిగింది.
అయితే కొంతమంది బయ్యర్లు మాత్రం ధర్నాకు దిగుతామంటూ బెదిరింపులకు పాల్పడంతో అలా చేసిన బయ్యర్లకు తాను డబ్బులు ఇవ్వాలని అనుకోవడం లేదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.పూరీ సినిమాలు హిట్టైన సమయంలో కూడా ఆయనకు రావాల్సిన డబ్బులు రాలేదు.
అదే సమయంలో పూరీ జగన్నాథ్ కొన్ని విషయాలకు సంబంధించి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.అతి మంచితనం వల్ల పూరీ జగన్నాథ్ కెరీర్ కు ఇబ్బందులు కలుగుతున్నాయి.హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా పూరీ జగన్నాథ్ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా పూరీ జగన్నాథ్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.పూరీ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.పూరీ జగన్నాథ్ ఎంతోమందికి మంచి చేసినా ఆయన విషయంలో మాత్రం కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు.