ఏపీలో రాజకీయ సమీకరణాలు గత కొద్ది రోజులుగా అనూహ్య మార్కులు చెందాయి.ముఖ్యంగా బీజేపీ , జనసేనలు పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉండడం, ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కావడం , వైసీపీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమైతే తప్పేంటి అన్నట్లుగా టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడడం, దానికి పవన్ సైతం మద్దతు తెలపడం వంటివి చోటు చేసుకున్నాయి.
అయితే ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు కొనసాగిస్తున్నాయి.బిజెపిని రూట్ మ్యాప్ అడిగినా, ఆ పార్టీ స్పందించలేదని, కలిసి వెళ్లినా ఉపయోగం లేదన్నట్లుగా పవన్ మాట్లాడారు.
మాత్రం తాము 2024 ఎన్నికల్లో జనసేన తో కలిసి పోటీ చేస్తామని టిడిపిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమతో భాగస్వామ్యం చేసుకోమంటూ ప్రకటన చేశారు.
అయితే బిజెపితో వెళ్లే కంటే, టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తేనే వైసిపిని ఓడించగలమనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని బిజెపి నాయకులు గ్రహించారు.అందుకే తమతోనే జనసేన పొత్తు పెట్టుకోవాలని, టిడిపికి వీలైనంత దూరంగా ఉంచాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.
అందుకే బీజేపీ కీలక నాయకులంతా పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. పవన్ బిజెపి కంటే టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు.
అయితే బిజెపిలోని కొంతమంది నాయకులు మాత్రం టిడిపి, బిజెపి, జనసేన కలవాలని ప్రకటనలు చేస్తున్నారు.విశాఖ బీజేపీ కీలక నేత విష్ణుకుమార్ రాజు దీనిపై ప్రకటన చేశారు.
ఇక ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటూ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్ అన్నారు.

ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు సైతం టిడిపిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపుకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.బిజెపిలోని మరో వర్గం మాత్రం టిడిపి తో పొత్తు పెట్టుకోవాలని బిజెపి అధిష్టానం పై ఒత్తిడి చేస్తుంది.ఈ విషయంలో మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో పాటు, బిజెపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వంటి వారు అధిష్టానం పై ఒత్తిడి పెంచే వారి లిస్టులో ఉన్నారు.
ఏది ఏమైనా టిడిపి, జనసేన, బిజెపి కలిస్తేనే వైసీపీని అధికారానికి దూరం చేయగలమనే అభిప్రాయం మూడు పార్టీల నేతలలో ఉన్నా… కొంతమంది కీలక నాయకులు మాత్రం టిడిపిని వీలైనంత దూరం పెట్టే విధంగా పవన్ పై ఒత్తిడి పెంచుతున్నారట.







