సినిమాల్లో, ప్రకటనలలో చూపించే స్టంట్స్ చాలా వరకు ఫేక్ ఉంటాయి.మరికొన్ని స్టంట్స్‌ను బాగా అనుభవం ఉన్న వారు మాత్రమే చేస్తారు.
ఇక కొన్ని హై ఎండ్ గేమ్స్‌లో కనిపించే స్టంట్స్ అసలు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉంటాయి.ఇలాంటివి నిజజీవితంలో కూడా చేయాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరేదీ ఉండదు.
అయితే తాజాగా అలాంటి ఒక మూర్ఖపు పనిచేసి కారును నాశనం చేసుకున్నాడో వ్యక్తి.ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోను @Positivelyhani అనే ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.
షేర్ చేసిన సమయం నుంచి దీనికి 44 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక కారు అత్యంత వేగంగా దూసుకు రావడం చూడవచ్చు.
ఆ కారు వెళ్తున్న రోడ్డుకి పక్కనే కొందరు నిల్చొని వీడియో తీస్తున్నారు.ఇంతలోనే ఆ కారు చాలా వేగంగా వచ్చి గాల్లో తేలింది.
ఆ కారు వెళ్తున్న రహదారి ముందు ఒక పెద్ద డౌన్ రోడ్డు ఉంది.ఆ డౌన్ రోడ్డులోనే ఈ కారు గాల్లో ఎగురుతూ చాలా ముందుకు దూసుకెళ్లింది.
అయితే అది ల్యాండ్ అయ్యే సమయానికి కారు కంట్రోల్ కాలేదు.ఫలితంగా దాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పార్క్ చేసి ఉన్న మరొక కారుకి డాష్ ఇచ్చినట్లు కనిపించింది.
లేదంటే ఆ కారు బాగా పైకి గాల్లోకి ఎగిరి తన ముందు భాగంతో గ్రౌండ్‌ను డాష్ కొట్టినట్టు తెలుస్తోంది.కారణం ఏదైనా ఈ కారు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది.
లోపల ఉన్న అతనికి కూడా గాయాలైనట్లు అనిపించింది.

ఆ వీడియో తీస్తున్న వారు ఈ కారుకి అయిన డ్యామేజ్ కూడా క్లారిటీగా చూపించారు.ఈ వీడియో చూసినవారు డ్రైవర్ సరిగా యాక్సల్‌రేషన్ ఇవ్వలేదని అభిప్రాయపడుతున్నారు.మరికొందరు మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ ఎక్కడపడితే అక్కడ చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







