రష్యా ,ఉక్రెయిన్ ల మధ్య వార్ ఇప్పటిలో ముగిసేలా లేదు, రష్యా దాడులు చేసిన తరువాత ఉక్రెయిన్ ప్రతి దాడులతో రెచ్చిపోగా, రష్యా మరింత మెరుపు వేగంతో దాడులకు పాల్పడుతోంది.ఒక పక్క రాజీ కి చేసుకుందామని చెప్తూనే మరో పక్క అమెరికా అండదండలతో రష్యా పై దాడులకు తెగపడుతోంది.
ఈ క్రమంలో క్రిమియా , రష్యాకు అనుసంధానంగా ఉండే కీలక మైన పుతిన్ కలల వంతెనపై భారీ పేలుడు సంభవించడం, ఈ ఘటనకు కారణం ఉక్రెయిన్ అని రష్యా నిర్దారించుకోవడంతో రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపధ్యంలో అణు యుద్ధం జరగబోతోందని రష్యా అందుకు సిద్దంగా ఉండనే చర్చలు వినిపిస్తున్నాయి.దాంతో
అప్రమత్తమైన భారత ప్రభుత్వం ఏ సమయంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయోనని ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు వారి కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది.అంతేకాదు తక్షణమే ఉక్రెయిన్ వీడి భారత్ వచ్చేయాలని అందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ వెల్లడించింది.
భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్ లో భారతీయులు వారి కుటుంబాలు ఇంకెవరైనా మిగిలి ఉంటే తక్షణమే వారు ఆ దేశాన్ని వీడి రావాలని, ఈ క్రమంలో ఉక్రెయిన్ సరిహద్దులు దాటేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో ప్రకటించింది.హంగేరి, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా చెక్ పాయింట్ ల వివరాలను అందించింది.ఆయా సరిహద్దులకు చేరుకునేందుకు ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు ఉంటాయో తెలిపింది.
అంతేకాదు ప్రయాణం చేసి వచ్చే వారు ఎలాంటి భద్రతా నియమాలు పాటించాలో కూడా వెల్లడించింది.పాస్ పోర్ట్, వీసా తో పాటు ఉక్రెయిన్ నివాస పర్మిట్, ఐడీ కార్డులు, విమాన టిక్కెట్లు, భారతీయులమే ఆధార ధ్రువపత్రాలు తమతో ఉంచుకోవాలని సూచించింది.
.






