జపాన్ లో ట్రిపుల్ ఆర్ హవా.. ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సినిమా ట్రిపుల్ ఆర్.అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

 Rrr Recorded The Greatest Opening Ever For An Indian Film In Japan, Ram Charan,-TeluguStop.com

ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి.

నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.

నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టి అందరి చేత శబాష్ అనిపించు కున్నారు.

జక్కన్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు ఖ్యాతిని పెంచేసాడు.

Telugu Japan, Rajamouli, Ram Charan, Rrr, Rrr Japan, Rrrrecorded-Movie

ఇక ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మరి ఇండియన్ సినిమా దగ్గర సూపర్ హిట్ అయినా ఈ సినిమాకు జపాన్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా జపాన్ వెళ్లి అక్కడ ప్రొమోషన్స్ చేసి వారిని ఇంప్రెస్ చేసారు.

మరి తాజాగా ఈ సినిమా జపాన్ లో ఎంత వసూళ్లు చేసిందో బయటకు వచ్చింది.

ఈ సినిమాకు ఫస్ట్ డే 8 వేలకు పైగానే ఫుట్ ఫాల్స్ ఉన్నాయి.గతంలో జపాన్ లో ప్రభాస్ సాహో సినిమా 6 వేల 509, బాహుబలి 2 కు 1382, అమీర్ ఖాన్ దంగల్ సినిమాకు 1265 ఫుట్ ఫాల్స్ మాత్రమే ఉన్నాయి.

దీంతో మన ట్రిపుల్ ఆర్ రేసులో ఎంత ముందు ఉందో తెలుస్తుంది.ప్రొమోషన్స్ కలిసి రావడంతో ఈ సినిమాకు తొలిరోజు ఏకంగా 25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని టాక్ వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube